logo

‘నియంతృత్వ ప్రభుత్వాలకు బుద్ధి చెప్పాలి’

నియంతృత్వ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రజలు బుద్ధి చెప్పాలని ఎమ్మెల్యే సీతక్క పిలుపునిచ్చారు. కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన పాదయాత్ర రెండో రోజు కొనసాగింది. బుధవారం జగ్గన్నపేట నుంచి చిన్న గుంటూరుపల్లి,

Published : 11 Aug 2022 03:48 IST

పాదయాత్రలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే సీతక్క

ములుగు రూరల్‌, న్యూస్‌టుడే: నియంతృత్వ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రజలు బుద్ధి చెప్పాలని ఎమ్మెల్యే సీతక్క పిలుపునిచ్చారు. కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన పాదయాత్ర రెండో రోజు కొనసాగింది. బుధవారం జగ్గన్నపేట నుంచి చిన్న గుంటూరుపల్లి, సారంగపల్లి, పత్తిపల్లి మీదగా దేవగిరిపట్నం, కాశీందేవిపేట, జంగాలపల్లి గ్రామానికి చేరుకుంది. ఈ సందర్భంగా పత్తిపల్లి గ్రామానికి చెందిన మాజీ ఉప సర్పంచి, దేవగిరిపట్నంకు చెందిన 80 మంది తెరాస నాయకులకు కాంగ్రెస్‌ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆమె మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇచ్చిన మాట ప్రకారం పేదలకు డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లను మంజూరు చేయాలన్నారు. రైతులకు ఏక కాలంలో రూ.లక్ష రుణమాఫీ చేయాలన్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు కుమారస్వామి, టీపీసీసీ అధికార ప్రతినిధి రవళిరెడ్డి, నాయకులు రాజేందర్‌గౌడ్‌, రాంరెడ్డి, రవిచందర్‌, రవి, చాంద్‌పాషా, సూర్యనారాయణ, శ్రీనివాస్‌, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని