logo

వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహించాలి

భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ భవేశ్‌ మిశ్రా ఆదేశించారు. కలెక్టరేట్‌లో స్వాతంత్య్ర దినోత్సవాల ఏర్పాట్లపై సమీక్షించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ

Published : 11 Aug 2022 03:48 IST

అధికారులతో సమీక్షిస్తున్న కలెక్టర్‌ భవేశ్‌ మిశ్రా, పక్కన జేసీ స్వర్ణలత, అదనపు కలెక్టర్‌ దివాకర

భూపాలపల్లి కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ భవేశ్‌ మిశ్రా ఆదేశించారు. కలెక్టరేట్‌లో స్వాతంత్య్ర దినోత్సవాల ఏర్పాట్లపై సమీక్షించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ ఆగస్టు 15వ తేదీన భూపాలపల్లిలోని అంబేడ్కర్‌ క్రీడామైదానంలో స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలన్నారు. పోలీసు శాఖ ఆధ్వర్యంలో పరేడ్‌, విద్యాశాఖ ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించాలన్నారు. వివిధ శాఖలు తమ శాఖల ప్రగతిని తెలియజేసేలా ప్రదర్శనశాలలు,  డీఆర్డీవో, వ్యవసాయ, వైద్యశాఖ, మహిళా శిశు సంక్షేమం, విద్యాశాఖ, గిరిజన సంక్షేమం, గృహ నిర్మాణం, విద్యుత్తు, ఇంజినీరింగ్‌, అగ్నిమాపక తదితర శాఖల ప్రగతిని తెలిపేలా శకటాలను తయారు చేయాలన్నారు. వర్షాకాలం దృష్ట్యా తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. స్వాతంత్య్ర వజ్రోత్సవాలలో పాల్గొనడం మనందరి అదృష్టంగా భావించి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ సహకారం అందించాలన్నారు. కార్యక్రమంలో వివిధ శాఖలకు చెందిన జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని