logo

ప్రతి ఇంటిపై జెండా ఎగురవేయండి

ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి పేర్కొన్నారు. స్వాతంత్య్ర వజ్రోత్సవాల్లో భాగంగా బుధవారం భూపాలపల్లి మండలం వజినపల్లిలో వనమహోత్సవాన్ని నిర్వహించారు. ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా

Updated : 11 Aug 2022 04:29 IST

గాంధీనగరంలో నినదిస్తున్న ఎమ్మెల్యే గండ్ర, చిత్రంలో కలెక్టర్‌, అధికారులు

భూపాలపల్లి టౌన్‌, న్యూస్‌టుడే: ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి పేర్కొన్నారు. స్వాతంత్య్ర వజ్రోత్సవాల్లో భాగంగా బుధవారం భూపాలపల్లి మండలం వజినపల్లిలో వనమహోత్సవాన్ని నిర్వహించారు. ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. మొక్క నాటి నీళ్లు పోశారు. ఆయన మాట్లాడారు స్వాతంత్య్ర వజ్రోత్సవాలను  ఘనంగా నిర్వహించుకుందామన్నారు. కార్యక్రమంలో జడ్పీ వైస్‌ ఛైర్మన్‌ కళ్లెపు శోభ, ఎంపీపీ లావణ్య, తెరాస నాయకులు రఘుపతిరావు, సాగర్‌రెడ్డి, రవీందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

భూపాలపల్లి క్రైం: స్వాతంత్య్ర వజ్రోత్సవాలను విజయవంతం చేయాలని ఎస్పీ సురేందర్‌రెడ్డి అన్నారు. స్థానిక ఆర్ముడ్‌ రిజర్వు ప్రధాన కార్యలయంలో వన మహోత్సవం నిర్వహించారు. ఎస్పీ ముఖ్యఅతిథిగా పాల్గొని మొక్క నాటారు. ఆయన మాట్లాడుతూ వజ్రోత్సవాల్లో ప్రతి పౌరుడు పాల్గొనాలని పిలుపునిచ్చారు. జిల్లా, మండల కేంద్రాల్లో, గ్రామ పంచాయతీల్లో వన మహోత్సవం నిర్వహించాలన్నారు. వజ్రోత్సవాల్లో భాగంగా ఈనెల 22వ తేదీ వరకు వివిధ కార్యక్రమాలు చేపట్టాలని, ఇంటింటా జాతీయ పతాకాన్ని ఎగురవేయాలన్నారు. 11న ఫ్రీడం రన్‌, 13న ఆటల పోటీలు, 15న జెండాలను ఎగురవేయడం, 16న జాతీయ గీతాలాపన కార్యక్రమాలు నిర్వహిస్తారన్నారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ శ్రీనివాసులు, డీఎస్పీలు రాములు, కిషోర్‌కుమార్‌, సీఐలు పెద్దన్నకుమార్‌, జానీ నర్సింహులు, సతీష్‌ తదితరులు పాల్గొన్నారు.

భూపాపల్లిలో మొక్క నాటుతున్న ఎస్పీ సురేందర్‌రెడ్డి

గణపురం, న్యూస్‌టుడే: దేశంలో స్వాతంత్య్ర వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్న రాష్ట్రం తెలంగాణేనని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, కలెక్టర్‌ భవేశ్‌ మిశ్రా అన్నారు. గణపురం మండలం గాంధీనగరంలో మూడెకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఫ్రీడం పార్కును వారు ప్రారంభించారు. పార్కును ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామన్నారు. ఇంత పెద్ద స్థలంలో  మైదానాన్ని రూపొందించిన సర్పంచి మాధం మమత, కార్యదర్శి రాకేశ్‌లను అభినందించారు. విద్యార్థులకు  స్వాతంత్య్రం కోస పోరాడిన వీరులపై అవగాహన కలిగేందుకు థియేటర్లలో గాంధీ సినిమాను చూపిస్తామన్నారు. పార్కులో తెలంగాణ రాష్ట్రం, భూపాలపల్లి జిల్లా చిత్రాలను రూపొందించిన విద్యార్థులకు వారు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ దివాకర, డీపీవో ఆశాలత, డీఎఫ్‌వో లావణ్య, డీఆర్డీవో పురుషోత్తం, కార్యదర్శులు రాకేశ్‌, నవీన్‌, ఎంపీటీసీ సభ్యురాలు సరస్వతి, నాయకులు సుధాకర్‌, శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని