logo

ప్రభుత్వ కారులో గుట్కా రవాణా

వరంగల్‌ కమిషనరేట్‌ పోలీసులు గుట్కా రవాణాపై ఉక్కు పాదం మోపుతుండటంతో అక్రమార్కులు రవాణా చేసేందుకు నిందితులు పలు మార్గాలను అనుసరిస్తూ పోలీసులకు చిక్కకుండా రవాణా చేస్తున్నారు.

Published : 11 Aug 2022 03:49 IST

నిందితుడిని అరెస్టు చేసి గుట్కాను స్వాధీనం చేసుకున్న పోలీసులు

వరంగల్‌క్రైం, న్యూస్‌టుడే: వరంగల్‌ కమిషనరేట్‌ పోలీసులు గుట్కా రవాణాపై ఉక్కు పాదం మోపుతుండటంతో అక్రమార్కులు రవాణా చేసేందుకు నిందితులు పలు మార్గాలను అనుసరిస్తూ పోలీసులకు చిక్కకుండా రవాణా చేస్తున్నారు. వరంగల్‌ పెద్దమ్మగడ్డకు చెందిన జంగం సురేశ్‌ తన కారుపై ప్రభుత్వ విధుల్లో ఉన్నట్లు రాసి ఉన్న నకిలీ స్టిక్కర్‌ను అతికించుకుని గుట్కా రవాణా చేస్తూ హనుమకొండ పోలీసులకు చిక్కారు. బుధవారం హనుమకొండ ఠాణాలో సెంట్రల్‌జోన్‌ డీసీపీ అశోక్‌కుమార్‌ నిందితుడి వివరాలను వెల్లడించారు. సురేశ్‌ కొద్ది రోజులుగా ఇతర రాష్ట్రాల నుంచి తక్కువ ధరకు గుట్కా కొనుగోలు చేసి ఈ కారులో రవాణా చేస్తున్నాడు. దీనిపై హనుమకొండ పోలీసులకు సమాచారం రావడంతో ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాస్‌జీ తన బృందంతో పెద్దమ్మగడ్డలోని సురేశ్‌ ఇంట్లో తనిఖీలు చేసి రూ.7.20లక్షల విలువైన గుట్కాతో పాటు కారును స్వాధీనం చేసుకుని నిందితుడిని అరెస్టు చేశారు. హనుమకొండ ఏసీపీ కిరణ్‌కుమార్‌, ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాస్‌జీ, ఎస్సై రాజ్‌కుమార్‌ను డీసీపీ అశోక్‌కుమార్‌ అభినందించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని