logo

కాలువలు మాయం!

పట్టణంలోని మహబూబాబాద్‌ నుంచి తొర్రూరు వెళ్లే ప్రధాన రహదారి పక్కనే ఉన్న స్థిరాస్తి వెంచర్‌లోని మైనర్‌ కాలువ. పూడ్చి నాలుగేళ్లు గడిచినా అధికారులు పట్టించుకోవడం లేదు. సంబంధిత అధికారులు పట్టించుకోకపోతే

Published : 13 Aug 2022 04:37 IST

పట్టణంలోని మహబూబాబాద్‌ నుంచి తొర్రూరు వెళ్లే ప్రధాన రహదారి పక్కనే ఉన్న స్థిరాస్తి వెంచర్‌లోని మైనర్‌ కాలువ. పూడ్చి నాలుగేళ్లు గడిచినా అధికారులు పట్టించుకోవడం లేదు. సంబంధిత అధికారులు పట్టించుకోకపోతే కాలువ అనవాళ్లు కూడా కనిపించడం కష్టమేనంటూ చివరి ఆయకట్టు రైతులు అంటున్నారు.

ఈ చిత్రంలో కనిపిస్తున్న ఎస్పారెస్పీ కాలువ కురవి మండలం నేరడ సమీపంలోనిది. దాని సమీపంలోని రైతులు కాలువ అంచు వరకు చదును చేసి ఆ భూమిని సాగు చేసుకుంటున్నారు. ఫుట్‌వేగా రెండు వైపుల ఉన్న స్థలాన్ని కలిపేసుకున్నారు. భూ సేకరణ సమయంలో పరిహారం ఇచ్చినప్పటికీ రూ.లక్షలు విలువ చేసే స్థలాన్ని అక్రమించుకుంటున్నారు.

జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో సాగు భూములకు గోదావరి జలాలను అందించేందుకు నిర్మించిన ఎస్సారెస్పీ మైనర్‌ కాలువలు మాయమవుతున్నాయి. సుమారు లక్ష ఎకరాలకు పైగా భూములకు సాగునీటిని సరఫరా చేసేందుకు ఎస్సారెస్పీ మొదటి, రెండు దశల్లో కాలువలు నిర్మించారు.  తొలిదశలో వరంగల్‌ జిల్లా తీగరాజుపల్లి నుంచి మహబూబాబాద్‌ జిల్లా డోర్నకల్‌ వెన్నారం వరకు డీబీఎం-48 మొదటి దశ కాలువలను నిర్మించారు. తొర్రూరు నుంచి మరిపెడ వరకు రెండో దశలో డీబీఎం-60 కాలువను నిర్మించారు. వీటి ప్రధాన కాల్వ పరిధిలోని మైనర్‌ కాలువలను తమ పంట పొలాలతో కలిపి పూడ్చి వేసి ఇళ్ల స్థలాకు విక్రయిస్తున్నారు.

* మహబూబాబాద్‌ పట్టణంలోని ఈదులపూసపల్లి వెళ్లే రోడ్‌లో అంబేడ్కర్‌ కాలనీ సమీపంలోనిది, శనగపురం శివారు, బీసీ కాలనీ సమీప ప్రాంతాల్లో కబ్జా చేశారు. మంగళి కాలనీ- మల్యాల వెళ్లే రోడ్‌లో కాలువలను పూడ్చి వేశారు.
* మరిపెడ వెళ్లే రోడ్‌ నుంచి అనంతాద్రి ఆలయం వెళ్లే రోడ్‌లో వ్యవసాయ భూములు ఇళ్ల స్థలాలుగా మారడంతో ఎస్పారెస్పీ మైనర్‌ కాలువలు కనిపించడం లేదు.
మహబూబాబాద్‌ పట్టణంలోని సబ్‌జైల్‌కు వెళ్లే రహదారి పక్కనే ఉన్న మైనర్‌ కాలువ. దీనిని సమీప ప్రాంత రైతులు పూడ్చేశారు. పక్కనే భూమిని స్థిరాస్తి వ్యాపారులు ఇళ్ల స్థలాలుగా మార్చారు. కాలువ పొడువునా కాలిబాట కోసం సేకరించిన స్థలాన్ని కూడా కలిపివేశారు. కాలువ స్థలాన్నే దారిగా చూపించేలా ఏర్పాట్లు చేశారు. ఈ ప్రాంతంలో గజం స్థలం విలువ రూ. 10 నుంచి రూ. 15 వేల వరకు ఉంటుంది. ఒక్కో ప్లాట్‌లో పది గజాల స్థలం కలిసినా రూ. లక్ష విలువైన భూమిని ఎస్పారెస్పీ కాలువ కోల్పోతోంది.

 


ఫిర్యాదు చేసినా ఫలితం లేదు  - ఆవుల సాయిమల్లు, నైనాల, నెల్లికుదురు మండలం
మాకు డీబీఎం 48 కాలువ పరిధిలో వ్యవసాయ భూమి ఉంది. ఈ కాలువకు రెండు వైపులా ఉన్న కాలినడక భూమిని కొందరు రైతులు తమ సాగు భూమిలో కలిపి పంటలను సాగు చేసుకుంటున్నారు. దాంతో 50 మంది రైతులు తమ సాగు భూముల వద్దకు వెళ్లడానికి సరైన బాట సౌకర్యం లేక అవస్థలు పడుతున్నారు. ఈ విషయమై జలవనరులశాఖ అధికారులకు విన్నవించినప్పటికీ ఫలితం లేదు. ఉన్నతాధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకు దారి సౌకర్యం కల్పించాలని సాయిమల్లు కోరుతున్నారు.


నోటీసులు ఇస్తున్నాం
- వెంకటేశ్వర్లు, ఎస్‌ఈ, జలవనరులశాఖ, మహబూబాబాద్‌

కాలువ భూములను స్తిరాస్థి వెంచర్లల్లో కలుపుకున్న వాటిని గుర్తిస్తున్నాం. అలా చేసిన వారికి నోటీసులు జారీ చేస్తున్నాం. కాలువ భూముల్లో నిర్మాణాలు చేపడితే చర్యలు తీసుకుంటున్నాం.


ఎస్సారెస్పీ స్టేజ్‌-1 (డీబీఎం-48) (10.5 కి.మీ నుంచి 77.00 కి.మీ వరకు) ఆయకట్టు: 1,35,846 ఎకరాలు
‘‘    ’’   స్టేజ్‌-2 (డీబీఎం60) (17.50 కి.మీ నుంచి 45.20 కి.మీ వరకు)  54,723 ఎకరాలు

Read latest Warangal News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని