logo

ప్రభుత్వ ఆసుపత్రుల్లో పెరిగిన సాధారణ ప్రసవాలు

ఒకప్పుడు ఆసుపత్రుల్లో సాధారణ ప్రసవాలు మాత్రమే జరిగేవి. కానీ, ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఎక్కువ శాతం వైద్యులు సిజేరియన్‌ ద్వారానే ప్రసవాలు చేస్తున్నారు. దీని ప్రభావం భవిష్యత్తులో తల్లుల ఆరోగ్యంపై పడనుంది. ప్రపంచ

Published : 13 Aug 2022 04:37 IST

వర్ధన్నపేట రూరల్‌, న్యూస్‌టుడే: ఒకప్పుడు ఆసుపత్రుల్లో సాధారణ ప్రసవాలు మాత్రమే జరిగేవి. కానీ, ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఎక్కువ శాతం వైద్యులు సిజేరియన్‌ ద్వారానే ప్రసవాలు చేస్తున్నారు. దీని ప్రభావం భవిష్యత్తులో తల్లుల ఆరోగ్యంపై పడనుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పినట్లు 15 శాతం సిజేరియన్లు అవసరమవుతాయని, అంతకు మించి కొన్ని ఆసుపత్రుల్లో 50-70 శాతం ఆపరేషన్లు చేస్తున్నారని పేర్కొంది. మంచి ముహూర్తాలకు పిల్లలను కనాలని, నొప్పి భరించక ఆపరేషన్‌ చేయాలని చాలా మంది వైద్యులను కోరుతున్నారు. మొదటి కాన్పుకు ఆపరేషన్‌ చేస్తే రెండో కాన్పుకు కూడా అదే పరిస్థితి. ఇది గుర్తించిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సాధారణ ప్రసవాలను ప్రోత్సహిస్తున్నాయి. జిల్లాలోని వర్ధన్నపేట సీహెచ్‌సీలకు ఎక్కువగా పేదలు వస్తుంటారు. ఇక్కడి వైద్యుల ప్రత్యేక చొరవతో అత్యధికంగా సాధారణ ప్రసవాలు చేస్తూ.. ఉమ్మడి వరంగల్‌ జిల్లాతో పాటు రాష్ట్రస్థాయిలో ఉత్తమంగా నిలుస్తున్నారు.
ప్రోత్సాహకం
ప్రభుత్వ ఆసుపత్రుల్లో సీజేరియన్లు తగ్గించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం 2017లో కేసీఆర్‌ కిట్‌ను ప్రారంభించింది. ఈ పథకం సహకారంతో వర్ధన్నపేట సీహెచ్‌సీలో గర్భిణిలకు సాధారణ ప్రసవం వల్ల కలిగే ప్రయోజనాలను వివరిస్తున్నారు. తల్లికి, బిడ్డకు ఇబ్బంది తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటూ జన్మనిచ్చే తల్లులతో వ్యాయామం చేయిస్తున్నారు. ‘మిడ్‌ వైఫరీ’ శిక్షణ పొందిన నర్సులు, ఇతర వైద్య సిబ్బంది ప్రసవానికి ముందు గర్భిణులను శారీరకంగా, మాససికంగా సిద్ధం చేస్తున్నారు.


వైద్య సేవలు బాగున్నాయి
శ్వేత, తొర్రూరు

మాది మహబూబాద్‌ జిల్లా తొర్రూరు శివారు పటేల్‌గూడెం. వర్ధన్నపేట ఆసుపత్రికి మూడు రోజుల కిత్రం వచ్చాను. వైద్యులు సాధారణ ప్రసవం చేస్తామని చేపడంతో మొదట భయపడ్డాను. కానీ.. ఇక్కడి వైద్యులు, నర్సులు పలు సూచనలు చేశారు. పురిటి నొప్పులు వస్తున్న సమయంలో ఏ విధంగా వ్యవహరించాలో చెప్పారు. వారి సూచనలతో ప్రసవం సుఖంగా జరిగింది.


అవగాహన కల్పిస్తున్నాం
-నరసింహస్వామి, వర్ధన్నపేట ఆసుపత్రి, సూపరింటెండెంట్‌

ప్రభుత్వ సూచనల మేరకు వర్ధన్నపేట సీహెచ్‌సీకి వచ్చే గర్భిణిలకు సాధారణ ప్రసవాలతో కలిగే ప్రయోజనాలపై అవగాహన కల్పిస్తున్నాం. ఆశా కార్యకర్తలు, ఆరోగ్య సిబ్బందికి ఆసుపత్రిలో ప్రత్యేక స్థలం కేటాయించి గర్భిణి, వారి కుటుంబ సభ్యులకు సూచనలిస్తున్నాం. గర్భాధారణ సమయం నుంచి ప్రసవమయ్యే వరకు వారిని శారీరకంగా, మాససికంగా సిద్ధమయ్యేలా చర్యలు తీసుకుంటున్నాం.


వర్ధన్నపేట సీహెచ్‌సీలో సాధారణ ప్రసవాల వివరాలు
నెల కాన్పుల సంఖ్య            
జనవరి 23                            
ఫిబ్రవరి 19        
మార్చి 24        
ఏప్రిల్‌ 44        
మే   23
జూన్‌ 26
జులై 28

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని