logo

త్యాగమూర్తుల స్ఫూర్తితో ముందుకు సాగాలి

దేశ స్వాతంత్య్రం కోసం త్యాగం చేసిన నాయకుల చరిత్ర తెలుసుకొని ప్రతి ఒక్కరు స్ఫూర్తి పొందాలని మంత్రి సత్యవతి రాథోడ్‌ అన్నారు. శనివారం ములుగులో జరిగిన వజ్రోత్సవ ర్యాలీలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. కలెక్టర్‌

Published : 14 Aug 2022 05:58 IST

ర్యాలీలో మంత్రి సత్యవతి రాథోడ్‌, కలెక్టర్‌, ఐటీడీఏ పీవో, ఏఎస్పీ, డీఆర్‌వో

ములుగు, న్యూస్‌టుడే: దేశ స్వాతంత్య్రం కోసం త్యాగం చేసిన నాయకుల చరిత్ర తెలుసుకొని ప్రతి ఒక్కరు స్ఫూర్తి పొందాలని మంత్రి సత్యవతి రాథోడ్‌ అన్నారు. శనివారం ములుగులో జరిగిన వజ్రోత్సవ ర్యాలీలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. కలెక్టర్‌ కృష్ణఆదిత్య ఆధ్వర్యంలో పాఠశాలల విద్యార్థులు, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, పట్టణ ప్రజలు, ప్రజాప్రతినిధులు కలెక్టర్‌ కార్యాలయం నుంచి జాతీయ రహదారి మీదుగా బస్టాండు వరకు జాతీయ జెండాలు చేతబూని భారీ ర్యాలీ నిర్వహించారు. జాతీయ గీతాలాపన, డప్పు చప్పుళ్లు, నృత్యాలతో హోరెత్తించారు. బస్టాండు కూడలిలో మంత్రి ప్రజలనుద్దేశించి మాట్లాడారు. దేశ స్వాతంత్య్రం లాగే మనం స్వరష్ట్రాన్ని సాధించుకున్నామని వివరించారు. పరిపాలనా సౌలభ్యం కోసం చిన్న జిల్లాలు ఏర్పాటు చేసుకుని అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామన్నారు. స్వాతంత్య్ర స్ఫూర్తి ముందు తరాలకు తెలిసే విధంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వివరించారు. ఈ బృహత్‌ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు భాగస్వాములై కృషి చేయాలన్నారు. ఐటీడీఏ పీవో అంకిత్‌, ఏఎస్పీ సుధీర్‌ రామ్‌నాథ్‌, అదనపు కలెక్టర్‌ వైవీ గణేష్‌, డీఆర్‌వో రమాదేవి, తహసీల్దారు సత్యనారాయణ స్వామి, ఎంపీపీ శ్రీదేవి, వివిధ ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

యువత ఉన్నత శిఖరాలు అధిరోహించాలి

ములుగు రూరల్‌: యువత ఉన్నత శిఖరాలను అధిరోహించాలని మంత్రి సత్యవతి రాథోడ్‌ అన్నారు. శనివారం జాకారంలోని యూత్‌ ట్రైనింగ్‌ సెంటర్లో కలెక్టర్‌ కృష్ణఆదిత్య అధ్యక్షతన గ్రూప్‌ 1, 2, ఎస్‌ఐ, పోలీస్‌ కానిస్టేబుల్‌ పోటీ పరీక్షల శిక్షణ ముగింపు కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. శిక్షణ పొందిన యువతీ యువకులు ఉద్యోగాలు సాధించాలని ఆకాంక్షించారు. ఐటీడీఏ పీవో అంకిత్‌, ఏఎస్పీ సుధీర్‌, డీఆర్‌ఓ రమాదేవి, ఎంపీపీ శ్రీదేవి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని