logo

ప్రజల్లో జాతీయభావం పెంపొందించాలి

వజ్రోత్సవాల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్‌ భవేశ్‌ మిశ్రా పిలుపునిచ్చారు. శనివారం జిల్లాకేంద్రంలోని అంబేడ్కర్‌ సెంటర్‌ నుంచి కృష్ణకాలనీలోని అంబేడ్కర్‌ క్రీడా మైదానం వరకు ఫ్రీడమ్‌ ర్యాలీ నిర్వహించారు.

Published : 14 Aug 2022 05:58 IST

బెలూన్లను ఎగరేస్తున్న కలెక్టర్‌, ఎమ్మెల్యే, ఎస్పీ తదితరులు

భూపాలపల్లి కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: వజ్రోత్సవాల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్‌ భవేశ్‌ మిశ్రా పిలుపునిచ్చారు. శనివారం జిల్లాకేంద్రంలోని అంబేడ్కర్‌ సెంటర్‌ నుంచి కృష్ణకాలనీలోని అంబేడ్కర్‌ క్రీడా మైదానం వరకు ఫ్రీడమ్‌ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో విద్యార్థులు, ఉద్యోగులు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజాప్రతినిధులు జాతీయ జెండాలను చేతబూని దేశభక్తి నినాదాలతో ర్యాలీ చేపట్టారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్‌, ఎస్పీ, ఎమ్మెల్యే, అదనపు కలెక్టర్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహించకుంటున్నామన్నారు. ప్రతి ఇంటికి జాతీయ జెండాను అందించి ప్రజల్లో జాతీయ భావాన్ని పెంపొందిస్తున్నామని అలాగే జిల్లాలోని సినిమా థియేటర్లలో విద్యార్థులకు ఉచితంగా తిలకించేలా గాంధీ చిత్రాన్ని ప్రదర్శిస్తున్నామని తెలిపారు. జిల్లాలోని ఉద్యోగులకు వివిధ క్రీడలను నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ.. 75 సంవత్సరాల ప్రజాస్వామ్య వ్యవస్థలో భారత దేశ స్వాతంత్య్రం కొరకు పోరాటం చేసిన వ్యక్తుల కీర్తిని నలుదిక్కులా చాటేలా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు. నూతనంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం అన్ని విభాగాల్లో దేశంలోనే ముందు వరుసలో ఉందని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా ఎస్పీ సురేందర్‌రెడ్డి, అదనపు కలెక్టర్‌ దివాకర, జేసీ స్వర్ణలత, డీపీవో ఆశాలత, జడ్పీ సీఈవో శోభారాణి, మున్సిపల్‌ కమిషనర్‌ శ్రీనివాస్‌, సీపీవో సామ్యూల్‌ తదితరులు పాల్గొన్నారు.

అంబేడ్కర్‌ క్రీడా మైదానంలో అతిపెద్ద భారత దేశ చిత్రపటం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని