logo

నీటి గుంతలో పడి బాలుడి మృతి

ప్రమాదవశాత్తూ ఓ బాలుడు నీటి గుంతలో పడి చనిపోయిన విషాదమిది. వరంగల్‌ భద్రకాళి రోడ్డు వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయం సమీపంలో శనివారం చోటుచేసుకున్న ఈ ఘటనలో పరిమి హరిహరన్‌(6) మృతిచెందాడు. భద్రకాళి రోడ్‌

Published : 14 Aug 2022 05:58 IST

హరిహరన్‌(పాత చిత్రం)

న్యూస్‌టుడే, రంగంపేట, ములుగు రోడ్డు: ప్రమాదవశాత్తూ ఓ బాలుడు నీటి గుంతలో పడి చనిపోయిన విషాదమిది. వరంగల్‌ భద్రకాళి రోడ్డు వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయం సమీపంలో శనివారం చోటుచేసుకున్న ఈ ఘటనలో పరిమి హరిహరన్‌(6) మృతిచెందాడు. భద్రకాళి రోడ్‌ వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయం సమీపంలో పరిమి ఫణిశర్మ- వైశాలి దంపతులు అద్దె ఇంట్లో నివాసముంటున్నారు. వీరికి ఇద్దరు కుమారులు. దంపతులు ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేస్తారు. పిల్లల ఆలనాపాలన అమ్మమ్మ, తాతయ్య చూస్తారు. తండ్రి ఇచ్చిన జాతీయ పతాకంతో ఆడుకుంటూ హరిహరన్‌ శనివారం ఇంటి సమీపంలోని నీటి గుంతవైపు వెళ్లాడు. అదే సమయంలో భద్రకాళి దేవాలయం నుంచి 75వ స్వాతంత్య్ర ర్యాలీ జరిగింది. మధ్యాహ్నం 12.30 వరకు కూడా మనుమడు ఇంటికి రాకపోవడంతో ఆ ర్యాలీ చూడడానికి వెళ్లి ఉంటాడని అమ్మమ్మ, తాతయ్య భావించారు. తర్వాత తప్పిపోయాడని భావించి పరిసరాల్లో వెతికారు. నీటి గుంత వద్ద పిల్లాడి కాలి అడుగులు గుర్తించి అనుమానంతో ఓ వ్యక్తి గుంతలోకి దిగి హరిహరన్‌ మృతదేహాన్ని వెలికి తీశాడు. సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లగా, వైద్యులు మృతి చెందినట్లుగా ధ్రువీకరించారు. దీంతో బాలుడి మృతదేహాన్ని ఎంజీఎం మార్చురీకి తరలించారు. మట్టెవాడ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని