logo

గీత దాటితే ఉద్యోగం ఉండదు!

ఎవరి పనులు వారే చేయాలి.., ఇతరుల విధుల్లో జోక్యం చేసుకుంటే ఉద్యోగాలు ఊడుతాయి. ఆర్‌ఐల డిజిటల్‌ కీస్‌, పాస్‌వర్డ్‌లు, లాగిన్లు వాడితే సదరు బిల్‌కలెక్టర్లు, కారోబార్లు, ఒప్పంద ఉద్యోగులపై శాఖాపరమైన చర్యలు తప్పవని మేయర్‌ గుండు

Published : 18 Aug 2022 05:24 IST

పన్నుల విభాగం ఆర్‌ఐలతో సమావేశమైన మేయర్‌ సుధారాణి

కార్పొరేషన్‌, న్యూస్‌టుడే: ఎవరి పనులు వారే చేయాలి.., ఇతరుల విధుల్లో జోక్యం చేసుకుంటే ఉద్యోగాలు ఊడుతాయి. ఆర్‌ఐల డిజిటల్‌ కీస్‌, పాస్‌వర్డ్‌లు, లాగిన్లు వాడితే సదరు బిల్‌కలెక్టర్లు, కారోబార్లు, ఒప్పంద ఉద్యోగులపై శాఖాపరమైన చర్యలు తప్పవని మేయర్‌ గుండు సుధారాణి హెచ్చరించారు. బుధవారం ‘ఈనాడు’లో వచ్చిన వారిదే కీలక పాత్ర కథనానికి ఆమె స్పందించారు. సాయంత్రం పన్నుల విభాగం ఆర్వోలు, ఆర్‌ఐలు, బిల్‌కలెక్టర్లతో సమావేశం నిర్వహించారు. కంప్యూటర్‌ పరిజ్ఞానం, ఇ-ఆఫీీస్‌ ఓపెన్‌ చేయడం, దస్త్రాలు చూడటం తెలియదన్న ఆర్‌ఐలపై మండిపడ్డారు. ముగ్గురు, నలుగురు ఆర్‌ఐల ఫైళ్లు కిందిస్థాయి బిల్‌కలెక్టర్లు క్లియర్‌ చేస్తున్నారని, పద్ధతి మార్చుకోవాలని హెచ్చరించారు. అంతర్జాలంపై అవగాహన లేని వారికి 15 రోజుల్లో నేర్చుకునేలా శిక్షణ ఇవ్వాలని అదనపు కమిషనర్‌ రషీీద్‌, కంప్యూటర్‌ విభాగం ఇన్‌ఛార్జి రమేష్‌కు సూచించారు. ఆర్‌ఐల పేరుతో అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న కొందరు బిల్‌కలెక్టర్లు, కారోబార్లను పిలిపించి క్లాస్‌ తీసుకున్నారు. గీత దాటితే ఆర్‌ఐలను తొలగిస్తామన్నారు. ఆర్‌ఐలు, బిల్‌కలెక్టర్లపై వచ్చే అవినీతి ఆరోపణలపై విచారణ చేపట్టి శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ఉపకమిషనర్లను ఆదేశించారు. సమావేశంలో ఉపకమిషనర్లు జోనా, శ్రీనివాస్‌రెడ్డి, ఆర్వోలు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని