logo

తీజ్‌ ఉత్సవంలో నేతలు

గూడూరులో బుధవారం తీజ్‌ ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. తీజ్‌ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో బస్టాండ్‌ సమీపంలో వేడుకలు ఏర్పాటు చేశారు. తొమ్మిది రోజులు యువతులు నీటిని గోధుమబుట్టలు (తీజ్‌)పై చల్లి పూజలు నిర్వహించారు. బుధవారం

Published : 18 Aug 2022 05:24 IST

గూడూరులో బుధవారం తీజ్‌ ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. తీజ్‌ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో బస్టాండ్‌ సమీపంలో వేడుకలు ఏర్పాటు చేశారు. తొమ్మిది రోజులు యువతులు నీటిని గోధుమబుట్టలు (తీజ్‌)పై చల్లి పూజలు నిర్వహించారు. బుధవారం చివరి రోజు బోగ్‌బండార్‌ నిర్వహించారు. ఎంపీ మాలోతు కవిత, ఎమ్మెల్యే సతీమణి డాక్టర్‌ సీతామహాలక్ష్మి, ఎంపీపీ సుజాత, సింగిల్‌ విండో ఛైర్మన్‌ చల్లాలింగారెడ్డి యువతులకు తీజ్‌బుట్టలు అందజేశారు. ఊరేగింపుగా గ్రామసమీపంలోని పాకాలవాగులో నిమజ్జనం చేశారు. ఎంపీ కవిత, సీతామహాలక్ష్మి గిరిజన యువతులతో నృత్యాలు చేశారు. సర్పంచి రమేశ్‌, వైస్‌ఎంపీపీ వీరన్న, తీజ్‌ఉత్సవ సమితి అధ్యక్షుడు ధర్మనాయక్‌, గౌరవ అధ్యక్షుడు భరత్‌నాయక్‌, ప్రధానకార్యదర్శి సురేశ్‌, వాల్యానందస్వామి, కఠార్‌సింగ్‌ తదితరులు పాల్గొన్నారు. - న్యూస్‌టుడే, గూడూరు (కొత్తగూడ)

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని