logo

పులి సంచారంతో కలకలం

ఏజెన్సీలోని మారుమూల ప్రాంతమైన కన్నాయిగూడెం మండలంలోని ఐలాపూర్‌ అటవీ ప్రాంతంలో పెద్దపులి సంచారం కలకలం రేపుతోంది. పులి కదలికలు గుర్తించిన ప్రదేశం ములుగు, భూపాలపల్లి జిల్లాలకు చెందిన నాలుగు అటవీ రేంజిల

Published : 18 Aug 2022 05:24 IST

ఐలాపూర్‌ అటవీ ప్రాంతంలో పులి సంచరించిన

ప్రదేశాన్ని పరిశీలిస్తున్న అటవీ అధికారులు

కన్నాయిగూడెం, న్యూస్‌టుడే: ఏజెన్సీలోని మారుమూల ప్రాంతమైన కన్నాయిగూడెం మండలంలోని ఐలాపూర్‌ అటవీ ప్రాంతంలో పెద్దపులి సంచారం కలకలం రేపుతోంది. పులి కదలికలు గుర్తించిన ప్రదేశం ములుగు, భూపాలపల్లి జిల్లాలకు చెందిన నాలుగు అటవీ రేంజిల పరిధిలోని సరిహద్దులో ఉంది. ప్రస్తుతం వర్షాలు విస్తారంగా పడుతుండడంతో అడవి పచ్చబడి మళ్లీ సంచారం పెరిగింది. దీంతో అటవీ అధికారులు అప్రమత్తమయ్యారు. ఐలాపూర్‌ గ్రామానికి సంబంధించిన గొత్తికోయగూడెంలోని ఓ ఆవు మీద పులి ఈ నెల 16న రాత్రి దాడి చేసి హతమార్చింది. ఈ నేపథ్యంలో చుట్టు పక్కల గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కన్నాయిగూడెం మండలం ఐలాపూర్‌ అటవీ ప్రాంతంలో పులి సంచరిస్తున్నప్పటికీ సదరు అటవీ ప్రాంతం మాత్రం పస్రా అటవీ రేంజి పరిధిలో ఉంది. ఈ తర్వాత అటవీ ప్రాంతం మాత్రం ఏటూరునాగారం దక్షిణ రేంజిలోకి వస్తోంది. దీంతో రెండు రేంజ్‌ల అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. భూపాలపల్లి జిల్లా దూదేకులపల్లి మొదలైన నాలుగు రేంజిల అధికారులు అడవిలో పులి ఆనవాళ్ల కోసం అన్వేషణ మొదలుపెట్టారు. ఆవుపై పులి దాడి చేసిన ప్రాంతాన్ని బుధవారం అధికారులు పరిశీలించారు. అప్రమత్తంగా ఉండాలంటూ సమీప గ్రామాల ప్రజలకు సూచనలు జారీ చేశారు.

ట్రాప్‌ కెమెరాల ఏర్పాటు

ఐలాపూర్‌ అటవీ ప్రాంతంలో పులి కన్పించిన నేపథ్యంలో అది ఇటు సర్వాయి, భూపతిపూర్‌ వైపు రావచ్చనే స్థానిక అటవీ అధికారులు అప్రమత్తమయ్యారు. దీంతో భూపతిపురం రేంజిలో నీటి ఆవాసాల వద్ద ట్రాప్‌ కెమెరాలను అమర్చారు. అలాగే ప్రజలు ఎవరూ తమ పశువులను అడవిలోకి తీసుకెళ్లవద్దని ఉత్తర రేంజి అటవీ అధికారులు సూచించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని