logo
Updated : 18 Aug 2022 05:46 IST

మగ కూలీలు.. మస్తుగా నాట్లు!

ఎల్కతుర్తి మండలంలో వ్యవసాయ పొలాల్లో ఇప్పుడు ఎక్కడ చూసిన బీహార్‌, పశ్చిమబెంగాల్‌, ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్రాల కూలీలే కనిపిస్తున్నారు. సాగు పనులు ముమ్మరం కావడంతో మండలంలో కూలీలు కొరత తీవ్రంగా ఉంది. నెల రోజులుగా వర్షాలు పడటంతో నాట్లు ఇప్పటికే ఆలస్యంగా ప్రారంభమయ్యాయి. దీంతో పలువురు ఏజెంట్ల ద్వారా బీహార్‌, పశ్చిమబెంగాల్‌, ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్రాల నుంచి సుమారు 200 మంది కూలీలు వచ్చారు. ఒక్కో బృందంలో 20 మంది ఉంటారు. వీరు ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు నాటేస్తారు. సాధారణంగా మహిళా కూలీలు 15 మంది కలిసి ఎకరం నాటేసేందుకు రూ.5 వేలు గుత్తకు తీసుకుంటున్నారు. వీరికి మరో మగ మనిషి నారు అందిస్తే అతడికి రూ.1000 ఇవ్వాలి. ఇలా ఎకరం నాటు వేస్తే రూ.6 వేలు ఖర్చవుతుంది. అదే ఇతర రాష్ట్రాల కూలీలు మాత్రం రూ.4500 తీసుకుంటారు. రూ.1500 రైతుకు మిగులుతుంది. బీహార్‌ కూలీలు 20 మంది రోజుకు 8 నుంచి 10 ఎకరాల్లో నాటు వేస్తే, స్థానికంగా ఉండే కూలీలు మాత్రం 3 నుంచి 4 ఎకరాలు మాత్రమే వేస్తారు. ఇలా ఇతర రాష్ట్రాల కూలీలతో పనులు త్వరగా అవడంతో పాటు డబ్బులు మిగులుతుండటంతో వారితోనే నాటేసేందుకు ఆసక్తి చూపిస్తున్నట్లు పలువురు రైతులు పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ మండలంలోని సూరారం, వీరనారాయణపూర్‌, జీల్గుల గ్రామాల్లో 200 మంది కూలీలున్నారు. 

- న్యూస్‌టుడే, ఎల్కతుర్తి

Read latest Warangal News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని