logo

నిధుల హామీతోనే జనగామలో అడుగు పెట్టాలి

జనగామకు కావాల్సిన నిధులను కేంద్రం నుంచి తీసుకొస్తాననే హామిని బండి సంజయ్‌ ప్రజలకు చెప్పాలని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి డిమాండ్‌ చేశారు. జనగామలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.

Published : 18 Aug 2022 05:24 IST

మాట్లాడుతున్న ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి

జనగామ టౌన్‌, న్యూస్‌టుడే: జనగామకు కావాల్సిన నిధులను కేంద్రం నుంచి తీసుకొస్తాననే హామిని బండి సంజయ్‌ ప్రజలకు చెప్పాలని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి డిమాండ్‌ చేశారు. జనగామలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నీతి అయోగ్‌ సిఫార్సుల మేరకు రాష్ట్రానికి మిషన్‌ భగీరథ, మిషన్‌ కాకతీయ పనులకు రూ.25వేల కోట్లు కేంద్రంతో బండి సంజయ్‌ కొట్లాడి సాధించాలన్నారు. జనగామ పట్టణానికి అవసరమైన డ్రైనేజీకి రూ.100 కోట్లు, వైద్య కళాశాలకు నిధులు, సాగు, తాగునీటి అవసరాలకు కేంద్రం నుంచి నిధులు తీసుకొస్తానని జనగామ సభలో ప్రకటించాలన్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులను మోదీని అడిగి సాధించుకురావాలని, లేనిపక్షంలో భాజపా అధ్యక్ష పదవితో పాటు ఎంపీకి రాజీనామా చేయాలన్నారు. నిధుల కోసం రాజీనామా చేస్తే తామే బండి సంజయ్‌ గెలుపు కోసం కృషి చేస్తామని పేర్కొన్నారు. బండి సంజయ్‌ని అడ్డుకుంటారా అని ఎమ్మెల్యేను విలేకరులు ప్రశ్నించగా.. తాము అడ్డుకోబోమని, వచ్చే ఎన్నికల్లో ప్రజలే భాజపాకు గుణపాఠం చెబుతారన్నారు. సమావేశంలో మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ పోకల జమున, వైస్‌ ఛైర్మన్‌ రాంప్రసాద్‌, ఎంపీపీ కళింగరాజు, కౌన్సిలర్లు వాంకుడోత్‌ అనిత, పాండు, నాయకులు పోకల లింగయ్య, సురేష్‌రెడ్డి, ఉడుగుల కిష్టయ్య, లెనిన్‌ తదితరులు పాల్గొన్నారు.

జిల్లా ఆసుపత్రిలో రక్తదాన శిబిరం

వజ్రోత్సవాల సందర్భంగా బుధవారం జిల్లా ఆసుపత్రిలో నిర్వహించిన రక్తదాన శిబిరంలో ఎమ్మెల్యే మాట్లాడారు. ఆపదలో ఉన్న వారికి రక్తం అవసరమని, స్వచ్ఛంద సంస్థలు, యువజన సంఘాలు రక్తదాన శిబిరాలను నిర్వహించాలన్నారు. వజ్రోత్సవాల సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం 9వేల యూనిట్ల రక్తాన్ని సేకరించిందని తెలిపారు. అదనపు కలెక్టర్‌ అబ్దుల్‌ హమీద్‌, జడ్పీటీసీ సభ్యురాలు నిమ్మతి దీపిక, జిల్లా ఆసుపత్రి ఇన్‌ఛార్జి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ సుగుణాకర్‌రాజు, రక్తనిధి కేంద్రం ఇన్‌ఛార్జి డాక్టర్‌ రాంనర్సయ్య, వైద్యులు చాయాదేవి తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని