logo

అదరగొట్టిన ఈనాడు లక్ష్య అథ్లెట్లు

హనుమకొండ జిల్లా జేఎన్‌ స్టేడియంలో జరిగిన జిల్లా స్థాయి అథ్లెటిక్స్‌ పోటీల్లో ఈనాడు లక్ష్య అథ్లెట్లు అదరగొట్టారు. 20 పతకాలు సాధించి ఔరా అనిపించారు. 17 స్వర్ణం, 3 కాంస్య పతకాలు కొల్లగొట్టారు. జిల్లా స్థాయిలో అత్యుత్తమ ప్రదర్శన చేసిన

Published : 18 Aug 2022 05:24 IST

అథ్లెట్లను అభినందిస్తున్న కార్యదర్శి సారంగపాణి

వరంగల్‌ క్రీడావిభాగం, న్యూస్‌టుడే: హనుమకొండ జిల్లా జేఎన్‌ స్టేడియంలో జరిగిన జిల్లా స్థాయి అథ్లెటిక్స్‌ పోటీల్లో ఈనాడు లక్ష్య అథ్లెట్లు అదరగొట్టారు. 20 పతకాలు సాధించి ఔరా అనిపించారు. 17 స్వర్ణం, 3 కాంస్య పతకాలు కొల్లగొట్టారు. జిల్లా స్థాయిలో అత్యుత్తమ ప్రదర్శన చేసిన ఈనాడు అథ్లెట్లను, కోచ్‌ నాగరాజును హనుమకొండ జిల్లా యువజన, క్రీడల అభివృద్ధి అధికారి గుగులోతు అశోక్‌కుమార్‌, సంఘం కార్యదర్శి సారంగపాణి ప్రత్యేకంగా అభినందించారు. ముందు వరుసలో నిలిచిన లక్ష్య అథ్లెట్లకు వ్యక్తిగత మెడల్స్‌, ధ్రువపత్రాలను అందించారు.

వరంగల్‌ జిల్లా పరిధిలో...: వరంగల్‌ జిల్లా తరఫున బరిలోకి దిగిన అథ్లెట్లు పోషయ్య అండర్‌-18 విభాగంలో 400, 200, 100 మీటర్ల పరుగులో స్వర్ణ పతకాలు సాధించి ఉత్తమ ప్రతిభ చూపాడు. సౌరభ్‌ అండర్‌- 18లో 800 మీటర్లలో స్వర్ణం, 400 మీటర్లలో కాంస్య పతకాలు, నిరోష్‌ అండర్‌- 20లో 400 మీటర్లు, 200 మీటర్లలో స్వర్ణం, ఆదిత్య అండర్‌- 20లో 3000 మీటర్లలో స్వర్ణం, అభిరామ్‌ అండర్‌-18లో 1500 మీటర్లలో స్వర్ణం, రాజు లాంగ్‌జంప్‌లో స్వర్ణ పతకాలు సాధించారు.

హనుమకొండ జిల్లా : ప్రియదర్శిని అండర్‌- 16 విభాగంలో 2000 మీటర్లలో స్వర్ణం, 600 మీటర్లలో కాంస్యం, శివకుమార్‌ అండర్‌-18లో 400 మీటర్లు, 200 మీటర్లలో స్వర్ణం, ప్రియ అండర్‌-18లో 100, 200 మీటర్ల పరుగులో స్వర్ణం, రఘునాథ్‌ అండర్‌-18లో 800, 400 మీటర్ల పరుగులో స్వర్ణం, రోహిత్‌ అండర్‌-20లో 3000 మీటర్ల పరుగులో స్వర్ణం, వేణు అండర్‌-18లో 100 మీటర్ల పరుగులో కాంస్య పతకాలు సాధించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని