logo

పండగకూ పస్తులుండాల్సిందేనా..?

రాష్ట్రంలో అతిపెద్ద పండగైన బతుకమ్మ, దసరాకు పస్తులతో బతకాల్సిందేనా అంటూ వీఆర్‌ఏల సంఘం మండల అధ్యక్షుడు కంటెం బలరాములు అన్నారు. పేస్కేలు జీవోను అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ స్థానిక తహసీల్దారు కార్యాలయం ఎదుట ఆ సంఘం చేపట్టిన రిలే నిరాహార

Published : 26 Sep 2022 04:53 IST

నిరసన తెలుపుతున్న వీఆర్‌ఏలు

వెంకటాపురం, న్యూస్‌టుడే: రాష్ట్రంలో అతిపెద్ద పండగైన బతుకమ్మ, దసరాకు పస్తులతో బతకాల్సిందేనా అంటూ వీఆర్‌ఏల సంఘం మండల అధ్యక్షుడు కంటెం బలరాములు అన్నారు. పేస్కేలు జీవోను అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ స్థానిక తహసీల్దారు కార్యాలయం ఎదుట ఆ సంఘం చేపట్టిన రిలే నిరాహార దీక్షలు ఆదివారం 63వ రోజు కొనసాగాయి. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇచ్చిన హామీలను అమలు చేస్తామంటూ చర్చలకు పిలిచిన మంత్రి కేటీఆర్‌ అదే తరహాలో బుజ్జగించి పంపడంపై అసహనం వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కుటుంబాలు సంబరాలు చేసుకుంటుండగా మా గోడు కనిపించడం లేదా అంటూ మండిపడ్డారు. సంఘం నాయకులు రాజేశ్‌, సమ్మక్క, అరుణ, రజిత, బాజ్జీ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని