logo

ఇంటర్‌ ‘ప్రథమ’లో ప్రవేశాలు అంతంతే..

ఈ విద్యా సంవత్సరంలో (2022-23) జిల్లాలోని పది ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో ప్రథమ సంవత్సర ఇంటర్మీడియట్లో ప్రవేశాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. గత సంవత్సరం కంటే ప్రవేశాలు సుమారు రెండు వందలు తగ్గాయని భావిస్తున్నారు. ఈ సంవత్సరం జిల్లాలో పదో తరగతి వార్షిక పరీక్షల్లో

Published : 26 Sep 2022 04:53 IST

మానుకోట, న్యూస్‌టుడే: ఈ విద్యా సంవత్సరంలో (2022-23) జిల్లాలోని పది ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో ప్రథమ సంవత్సర ఇంటర్మీడియట్లో ప్రవేశాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. గత సంవత్సరం కంటే ప్రవేశాలు సుమారు రెండు వందలు తగ్గాయని భావిస్తున్నారు. ఈ సంవత్సరం జిల్లాలో పదో తరగతి వార్షిక పరీక్షల్లో బాలురు 4,101 మంది, బాలికలు 4,320 మంది ఉత్తీర్ణులయ్యారు. ఆగస్టులో నిర్వహించిన అడ్వాన్స్‌ సప్లిమెంటరీ పరీక్షల్లో 288 మంది బాలురు, 226 మంది బాలికలు.. మొత్తం 8,925 మంది ఉత్తీర్ణులయ్యారు. జిల్లాలో ప్రతి ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, హెచ్‌ఈసీ సాధారణ గ్రూపులు ఉన్నాయి. ప్రతి గ్రూపులో 44 వరకు సీట్లు ఉండగా ప్రతి కళాశాలలో 176 వరకు ఉంటాయి.  ఈ విధంగా మొత్తం 1,760 వరకు సీట్లు ఉండగా 872 మంది మాత్రమే చేరారు. నాలుగు కళాశాలల్లో వివిధ వృత్తి విద్యా కోర్సులు ఉన్నాయి. ఒక్కో కోర్సులో 40 సీట్లు ఉండగా ప్రవేశాలు కొంత వరకు ఫర్వాలేదు. 10 ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో సాధారణ, వృత్తి విద్యా కోర్సుల్లో మొత్తం 1,103 మంది మాత్రమే చేరారు.


ప్రవేశాలు ఇంకా పెరగొచ్చు..

- సమ్మెట సత్యనారాయణ, జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి

గత సంవత్సరం కంటే ఈసారి ఇంటర్మీడియెట్‌ ప్రథమ సంవత్సరంలో ప్రవేశాలు తగ్గిన మాట వాస్తవమే. జిల్లాలోని అన్ని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల అధ్యాపకులు ప్రవేశాల కోసం పదో తరగతి పాసైన  విద్యార్థుల ఇంటింటికి వెళ్లి ప్రచారాన్ని కూడా నిర్వహించారు. ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో చదివే విద్యార్థులకు ప్రభుత్వం అందిస్తున్న వివిధ సౌకర్యాల గురించి వివరించారు. ప్రవేశాలకు ఈ నెలఖరు వరకు గడువు ఉంది. ఇంకా ప్రవేశాలు పెరగవచ్చని భావిస్తున్నాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని