logo

నేటి నుంచి శరన్నవరాత్రి ఉత్సవాలు

కాళేశ్వర క్షేత్రంలో ఈ నెల 26 నుంచి అక్టోబర్‌ 5 వరకు దేవీశరన్నవరాత్రి ఉత్సవాలు జరగనున్నాయి. ఆలయ కార్యనిర్వహణాధికారి మహేశ్‌ ఆధ్వర్యంలో ప్రధాన అర్చకులు కృష్ణమూర్తిశర్మ, ఫణీంద్రశర్మ పర్యవేక్షణలో నిర్వహించనున్నారు. అనుబంధ ఆలయాల్లో కొలువైనున్న శుభానంద, సరస్వతీ దేవీలు తీరొక్క

Published : 26 Sep 2022 04:53 IST

విద్యుద్దీప కాంతుల్లో సరస్వతీ ఆలయం

కాళేశ్వరం, న్యూస్‌టుడే: కాళేశ్వర క్షేత్రంలో ఈ నెల 26 నుంచి అక్టోబర్‌ 5 వరకు దేవీశరన్నవరాత్రి ఉత్సవాలు జరగనున్నాయి. ఆలయ కార్యనిర్వహణాధికారి మహేశ్‌ ఆధ్వర్యంలో ప్రధాన అర్చకులు కృష్ణమూర్తిశర్మ, ఫణీంద్రశర్మ పర్యవేక్షణలో నిర్వహించనున్నారు. అనుబంధ ఆలయాల్లో కొలువైనున్న శుభానంద, సరస్వతీ దేవీలు తీరొక్క పూలమాలలతో నిత్య అలంకరణలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. అమ్మ వార్లను అలంకరించేందుకు చీరలు, వివిధ పుష్పాలను సమర్పించేందుకు ఇప్పటికే భక్తులు పెద్ద సంఖ్యలో దేవస్థానంలో నమోదు చేసుకున్నట్లు తెలిసింది.

నిత్య దర్శనం ఇలా....

26న శైలపుత్రి, 27న బ్రహ్మచారిణి, 28 చంద్రఘంట, 29 కూష్మాండ, 30 స్కందమాత, అక్టోబర్‌ 1న కాత్యాయనీ, 2న కాళరాత్రి (మూల నక్షత్రం వేడుకలు) 3న మహాగౌరీ (దుర్గాష్టమి) 4 మహర్నవమి సందర్భంగా సిద్ధిదా అలంకరణ నవరాత్రి ఉత్సవాలు జరగనున్నాయి. ముగింపులో భాగంగా అక్టోబర్‌ 5న శుభానందదేవీ సువర్ణ కిరీట రజత కవచాలంకృత అలంకరణలో భక్తులకు దర్శనభాగ్యం కల్పిస్తారు. అనంతరం ఆలయ యాగశాలలో పూర్ణాహుతి నిర్వహిస్తారు. దసరా ఉత్సవాన్ని పురస్కరించుకొని రామాలయం నుంచి గోదావరి తీరం వరకు ప్రత్యేక పల్లకిలో ఉత్సవమూర్తులను ఆసీనులను చేసి శమీ చెట్టు వద్దకు చేరుకొని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని