logo

కాడెద్దుల కష్టం రైతన్నకే ఎరుక

రైతులకు కాడెద్దులు వ్యవసాయంలో ఎంతగానో ఉపయోగపడతాయి. వాటికి భారం కాకుండా వాటి కష్టాన్ని తెలుసుకొని అన్నదాత మసులుకుంటాడు. పొద్దంతా దుక్కి దున్ని అలసిపోయిన ఎద్దులకు కాస్తయిన ఆసరా అవ్వాలని ఓ రైతు ఎద్దుల బండిని తానే లాగాడు. ములుగు జిల్లా మంగపేట మండలం కమలాపురానికి చెందిన ముడిగె రాజు అనే రైతు

Published : 26 Sep 2022 04:53 IST

రైతులకు కాడెద్దులు వ్యవసాయంలో ఎంతగానో ఉపయోగపడతాయి. వాటికి భారం కాకుండా వాటి కష్టాన్ని తెలుసుకొని అన్నదాత మసులుకుంటాడు. పొద్దంతా దుక్కి దున్ని అలసిపోయిన ఎద్దులకు కాస్తయిన ఆసరా అవ్వాలని ఓ రైతు ఎద్దుల బండిని తానే లాగాడు. ములుగు జిల్లా మంగపేట మండలం కమలాపురానికి చెందిన ముడిగె రాజు అనే రైతు ఆదివారం మిరప చేలో నాగలితో ఉదయం నుంచి సాయంత్రం వరకు దుక్కి దున్నాడు. సాయంత్రం ఇంటికి వచ్చే క్రమంలో నాగలిని ఎడ్లబండిలో పెట్టి తానే స్వయంగా భుజాన వేసుకొని కిలోమీటరు వరకు లాక్కెళ్లాడు. ఎద్దులు మేతకు ఇబ్బంది పడుతుంటే చూడలేక వాటి ఆకలి తీర్చేందుకు గడ్డి మేయడానికి వదిలానని రైతు తెలిపాడు. ఆయన బండి లాక్కుంటూ వెళ్తుంటే వెనక కాడెద్దులు రోడ్డుకు ఇరువైపులా ఉన్న పచ్చిగడ్డిని మేసుకుంటూ వచ్చాయి. ఈ చిత్రాన్ని ‘న్యూస్‌టుడే’ తన కెమెరాలో బంధించింది.

- న్యూస్‌టుడే, మంగపేట

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని