logo

ఏజెన్సీలో పోలీసుల విస్తృత గాలింపు

మావోయిస్టు పార్టీ ఆవిర్భావ వారోత్సవాల నేపథ్యంలో ఏజెన్సీ పోలీసులు అప్రమత్తమయ్యారు.. ఇటీవల జిల్లా అడవుల్లో మావోయిస్టుల కదలికలను గుర్తించిన జిల్లా పోలీసులు అప్రమత్తమయ్యారు. మావోయిస్టుల ఆచూకీ కోసం నిరంతరం అడవుల సమీప గ్రామాలపై నిఘాను పెట్టారు. ఎస్పీ శరత్‌చంద్ర

Published : 26 Sep 2022 04:53 IST

గంగారంలో వాహనాల తనిఖీ నిర్వహిస్తున్న ఎస్‌ఐ ఉపేందర్‌

కొత్తగూడ, న్యూస్‌టుడే: మావోయిస్టు పార్టీ ఆవిర్భావ వారోత్సవాల నేపథ్యంలో ఏజెన్సీ పోలీసులు అప్రమత్తమయ్యారు.. ఇటీవల జిల్లా అడవుల్లో మావోయిస్టుల కదలికలను గుర్తించిన జిల్లా పోలీసులు అప్రమత్తమయ్యారు. మావోయిస్టుల ఆచూకీ కోసం నిరంతరం అడవుల సమీప గ్రామాలపై నిఘాను పెట్టారు. ఎస్పీ శరత్‌చంద్ర పవార్‌ జిల్లాలోని ఏజెన్సీ పోలీసు ఠాణాలకు చెందిన సిబ్బందిని అప్రమత్తం చేస్తున్నారు. వారోత్సవాల సందర్భంగా కొత్తగూడ, గంగారం, గూడూరు, బయ్యారం పోలీసులు ముమ్మర తనిఖీలు చేపడుతున్నారు. అనుమానిత వాహనాల్లో నిత్యావసర సరకులు, సామాగ్రి అడవుల గ్రామాల్లోకి వెళ్తుందా అనేది పరిశీలిస్తున్నారు. మారుమూల ఏజెన్సీ గ్రామాల్లోని కిరాణ దుకాణాలకు వచ్చేటువంటి వారిపై పోలీసులు నిఘా పెట్టి గమనిస్తున్నారు. మండలాల్లో సంచరిస్తున్న నూతన వ్యక్తులపై అదుపులోకి తీసుకుని పూర్తి విచారణ అనంతరం పంపుతున్నారు. రాత్రి వేళల్లో మండలకేంద్రాల్లో పోలీసుల బందోబస్తు నిర్వహిస్తున్నారు.

అడవుల్లో కూంబింగ్‌

జిల్లా అడవుల్లో ప్రత్యేక పోలీసు బృందాలు కూంబింగ్‌ నిర్వహిస్తున్నాయి. అడవుల సమీప గ్రామాలతో పాటు అడవుల్లో పోలీసుల గాలింపులు చేపడుతున్నాయి. కొత్తగూడ, గంగారం అడవుల్లో సుమారు పది ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు పాల్గొంటున్నట్లు తెలిసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని