logo

చలివాగు మత్తడిలో కానిస్టేబుల్‌ గల్లంతు

చలివాగు ప్రాజెక్టు మత్తడిలో ఓ కానిస్టేబుల్‌ గల్లంతయ్యారు. ఈ సంఘటన హనుమకొండ జిల్లా శాయంపేట మండలం జోగంపల్లి-కొప్పుల గ్రామాల మధ్య ఉన్న చలివాగు ప్రాజెక్టు మత్తడి వద్ద జరిగింది. స్థానికులు, పోలీసులు

Published : 29 Sep 2022 02:03 IST

చలివాగు మత్తడిలో గల్లంతవుతున్న ఈయన కానిస్టేబుల్‌ రాజుగా గ్రామస్థులు చెబుతున్నారు.

శాయంపేట, న్యూస్‌టుడే: చలివాగు ప్రాజెక్టు మత్తడిలో ఓ కానిస్టేబుల్‌ గల్లంతయ్యారు. ఈ సంఘటన హనుమకొండ జిల్లా శాయంపేట మండలం జోగంపల్లి-కొప్పుల గ్రామాల మధ్య ఉన్న చలివాగు ప్రాజెక్టు మత్తడి వద్ద జరిగింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్‌లోని డాక్టర్స్‌ కాలనీకి చెందిన చెన్న రాజు దామెర పోలీసు స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. మంగళవారం శాయంపేట మండలం కొప్పులలోని తన అత్తగారింటికి వచ్చి ద్విచక్రవాహనంపై సాయంత్రం వెళ్తున్న క్రమంలో.. ప్రమాదవశాత్తు మత్తడి దాటుతుండగా నీటి ప్రవాహానికి కొట్టుకుపోయినట్లు స్థానికులు చెబుతున్నారు. స్థానికుల సమాచారం మేరకు ఏసీపీ శివరామయ్య, సీఐ శ్రీనివాస్‌, ఎస్సై వీరభద్రరావు, దామెర ఎస్సై హరిప్రియ, తహశీల్దార్‌ రాజు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. స్థానిక ఈతగాళ్ల సాయంతో ద్విచక్రవాహనాన్ని బయటకు తీశారు. మృతదేహం కోసం అగ్నిమాపక సిబ్బందిని సంఘటనా స్థలానికి రప్పించి వాగులో వెతికించినప్పటికీ  ఆచూకీ లభ్యం కాలేదు. మృతదేహం లభ్యమైతేనే పూర్తి వివరాలను తెలుస్తాయని, రాజు తండ్రి చంద్రయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్సై వీరభద్రరావు తెలిపారు.

సంఘటన స్థలాన్ని పరిశీలిస్తున్న ఏసీపీ శివరామయ్య

Read latest Warangal News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts