logo

నాడు ఘనం.. నేడు దయనీయం!

నగరంలో పారిశుద్ధ్య పనులు దారి తప్పుతున్నాయి. ఒకప్పుడు జాతీయ స్థాయిలో జరిగిన పోటీల్లో మొదటి 20 నగరాల్లో నిలిచింది. మూడేళ్లుగా పరిశీలిస్తే స్వచ్ఛ సర్వేక్షణ్‌ పోటీలో ర్యాంకు దిగజారుతోంది. నగరాన్ని చెత్త, ప్లాస్టిక్‌ రహితంగా తీర్చిదిద్దేందుకు

Published : 29 Sep 2022 02:03 IST

చెత్త రహిత పోటీల్లో బల్దియాకు దక్కని అవార్డు
న్యూస్‌టుడే, కార్పొరేషన్‌

ఖిలావరంగల్‌ కోటలో వాలంటీర్ల శ్రమదానం

గరంలో పారిశుద్ధ్య పనులు దారి తప్పుతున్నాయి. ఒకప్పుడు జాతీయ స్థాయిలో జరిగిన పోటీల్లో మొదటి 20 నగరాల్లో నిలిచింది. మూడేళ్లుగా పరిశీలిస్తే స్వచ్ఛ సర్వేక్షణ్‌ పోటీలో ర్యాంకు దిగజారుతోంది. నగరాన్ని చెత్త, ప్లాస్టిక్‌ రహితంగా తీర్చిదిద్దేందుకు భారీ ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు అధికారులంటున్నారు. ఇదంతా కాగితాల వరకే పరిమితమవుతోందనే విమర్శలొస్తున్నాయి. మంగళవారం కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ ప్రకటించిన ఇండియన్‌ స్వచ్ఛత లీగ్‌(ఐఎస్‌ఎల్‌) పోటీలో గ్రేటర్‌ వరంగల్‌కు అవార్డు దక్కలేదు. రాష్ట్రం నుంచి  మేడ్చల్‌ జిల్లా పీర్జాదిగూడ మున్సిపల్‌ కార్పొరేషన్‌, అలంపూర్‌, కోరుట్ల పురపాలక సంస్థకు అవార్డులు ప్రకటించారు. నగరం కనీసం టాప్‌- 50 లోనూ కనిపించడం లేదు.  దేశంలో పట్టణాలను స్వచ్ఛ రహితంగా తీర్చిదిద్దేందుకు కేంద్ర గృహ, పట్టణాభివృద్ధి శాఖ ఈ నెల 17న ఇండియాన్‌ స్వచ్ఛత లీగ్‌(ఐఎస్‌ఎల్‌) పోటీ నిర్వహించింది. దేశ వ్యాప్తంగా 1850 పట్టణాలు పాల్గొన్నాయి. గ్రేటర్‌ వరంగల్‌ పోటీకి సై అంది. ప్రజారోగ్యం, పర్యావరణ విభాగాలు ఇందుకు తగిన ప్రణాళిక రచించకపోవడంతో అభాసు పాలైంది. సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌, పరిసరాల పరిశుభ్రత, ఇంటింటా చెత్త సేకరణ, తడి, పొడి చెత్త వేరు చేయడం తదితర అంశాలపై వరంగల్‌ నగరంలోని 66 డివిజన్లలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించిన సమాచారాన్ని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ అధికారిక వెబ్‌సైటులో పొందుపర్చలేదు. ఈనెల 17న వివిధ కళాశాలల విద్యార్థులు, స్వచ్ఛ వారియర్స్‌తో ఖిలావరంగల్‌ కోట, భద్రకాళి బండ్‌, హనుమకొండ వేయిస్తంభాల గుడి దగ్గర పరిసరాల పరిశుభ్రత కార్యక్రమాలు, వరంగల్‌, హనుమకొండ ప్రాంతాల్లో ర్యాలీలు చేపట్టారు. కాలనీ కమిటీలు, స్వచ్ఛంధ సంస్థలు, పౌరుల భాగస్వామ్యం లేకుండానే మొక్కుబడిగా నిర్వహించారు. మాస్‌ శానిటేషన్‌, చెరువుల పరిసరాల శుభ్రత, చెత్త శుద్ధీకరణ తదితర అంశాల్లో వెనుకబడ్డారు. ఇలాగైతే వరంగల్‌ను చెత్త రహితం ఎలా చేస్తారని పర్యావరణవేత్తలు ప్రశ్నిస్తున్నారు.

అనుభవం లేని అధికారులు
గ్రేటర్‌ వరంగల్‌ ప్రజారోగ్యం, పర్యావరణ విభాగాల్లో అనుభవం లేని అధికారులున్నారు. ఆరేళ్లపాటు పనిచేసిన ముఖ్యఆరోగ్యాధికారి డాక్టర్‌ రాజారెడ్డి, ఇద్దరు, ముగ్గురు శానిటరీ ఇన్‌స్పెక్టర్లు బదిలీపై వెళ్లారు. ప్రస్తుత ముఖ్యఆరోగ్యాధికారి డాక్టర్‌ జ్ఞానేశ్వర్‌, ఆరోగ్యాధికారి డాక్టర్‌ రాజేష్‌ మున్సిపల్‌ శాఖకు కొత్తవారే. ఇద్దరు అధికారుల మధ్య సమన్వయ లోపం ఉందంటున్నారు. ఇదేగాక కీలకమైన పర్యావరణ విభాగానికి ఏడేళ్లుగా పూర్తిస్థాయి అధికారుల లేరు. ప్రస్తుతం డీఈ సంజయ్‌కుమార్‌ ఇన్‌ఛార్జి ఈఈగా కొనసాగుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు