logo

సర్కారు భూమి దర్జాగా కబ్జా

వరంగల్‌ జిల్లా గీసుకొండ మండలం గొర్రెకుంట శివారులోని జాన్‌పాకలో రూ.లక్షల విలువైన ప్రభుత్వ భూమి కబ్జా కోరల్లో చిక్కుకుంది. సర్వే నెంబరు 530లో సుమారు అర ఎకరం ప్రభుత్వ భూమి ఉంది. దీనిపై కొందరు కబ్జారాయుళ్ల కన్ను పడింది. ఇంత

Published : 29 Sep 2022 02:03 IST

ఈనాడు, వరంగల్‌, గీసుకొండ, న్యూస్‌టుడే

జాన్‌పాకలోని సర్వే నెంబర్‌ 530లో వెలిసిన నిర్మాణం

రంగల్‌ జిల్లా గీసుకొండ మండలం గొర్రెకుంట శివారులోని జాన్‌పాకలో రూ.లక్షల విలువైన ప్రభుత్వ భూమి కబ్జా కోరల్లో చిక్కుకుంది. సర్వే నెంబరు 530లో సుమారు అర ఎకరం ప్రభుత్వ భూమి ఉంది. దీనిపై కొందరు కబ్జారాయుళ్ల కన్ను పడింది. ఇంత జరుగుతున్నా రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకోవడం లేదు.

భవనం నిర్మించారు..
జాన్‌పాకలో సర్వేనెంబరు 530లో ఇప్పటికే  ఒకరిద్దరు ఇళ్లు నిర్మించుకున్నారు. తాజాగా పక్క సర్వే నెంబరులో ఉన్న ఒక వ్యక్తి సైతం ఈ భూమిపై కన్నేశారు. రెండు నెలల కిందట పనులు ప్రారంభించారు. ఈ విషయం రెవెన్యూ శాఖ దృష్టికి వెళ్లడంతో పనులు ఆపాలని సూచించారు. కొద్ది రోజుల పాటు నిలిపేశాక మళ్లీ ఇప్పుడు  ప్రారంభించారు. వరంగల్‌ మహానగరపాలక సంస్థ 16వ డివిజన్‌ కిందకు వచ్చే ఈ ప్రాంతంలో భూముల ధరలకు రెక్కలు వచ్చాయి. అనేక కాలనీలు వెలిశాయి. ఇప్పుడు కబ్జాకు గురవుతున్న సర్కారు భూమి విలువ రూ.50 లక్షల నుంచి రూ.70 లక్షలు పలుకుతుందని అంచనా. ఇప్పటికైనా అధికారులు పరిశీలించి చర్యలు తీసుకుంటే సర్కారు జాగాకు రక్షణ కలుగుతుంది.

సర్వే చేయించి చర్యలు తీసుకుంటాం
- విశ్వనారాయణ, తహసీల్దారు, గీసుకొండ

జాన్‌పాకలోని సర్వే నెంబకె 530 ప్రభుత్వ స్థలమే. రెండు నెలల  కిందట ఫిర్యాదు రాగా పనులు నిలిపి వేయించాం. ఈ స్థలంపై ఆర్‌ఐతో సర్వే చేయించి ప్రభుత్వ భూమిలోని నిర్మాణాన్ని తొలగిస్తాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని