logo

తేలిన లాభాల వాటా!

సింగరేణి సంస్థ 2021-22 ఆర్థిక సంవత్సరంలో రూ.1227 కోట్ల లాభాలను ఆర్జించింది. గత ఆర్థిక సంవత్సరం ముగిసి ఆరు మాసాలు గడుస్తున్న క్రమంలో యాజమాన్యం లాభాలను అధికారికంగా ప్రకటించింది. అదేవిధంగా కార్మికుల

Published : 29 Sep 2022 02:03 IST

కోల్‌బెల్ట్‌, న్యూస్‌టుడే: సింగరేణి సంస్థ 2021-22 ఆర్థిక సంవత్సరంలో రూ.1227 కోట్ల లాభాలను ఆర్జించింది. గత ఆర్థిక సంవత్సరం ముగిసి ఆరు మాసాలు గడుస్తున్న క్రమంలో యాజమాన్యం లాభాలను అధికారికంగా ప్రకటించింది. అదేవిధంగా కార్మికుల వాటా శాతాన్ని కూడా బుధవారం వెల్లడించింది. అక్టోబరు 1వ తేదీన కార్మికులకు వాటా డబ్బులు చెల్లించనున్నట్లు యాజమాన్యం పేర్కొంది.  

కార్మికులకు రూ.368 కోట్ల పంపిణీ
సింగరేణి గతేడాది 65 మిలియన్‌ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేసింది. రూ.26,607 కోట్ల టర్నోవర్‌ సాధించింది. దీని నుంచి పన్నులు పోగా నికర లాభాలు రూ.1227 కోట్లు వచ్చాయి. ఇందులో నుంచి కార్మికులకు 30 శాతం చెల్లించనుంది. కంపెనీ వ్యాప్తంగా 44వేల మంది పని చేస్తున్నారు. వీరందరికీ రూ.368 కోట్లను పంపిణీ చేయనుంది. సుమారుగా ఒక్కొక్కరికి రూ.60వేల నుంచి రూ.లక్ష వరకు అందుతాయి. భూపాలపల్లి ఏరియాకు రూ.20కోట్ల వరకు రానున్నాయి. ఇక్కడ నాలుగు భూగర్భ గనులు, రెండు ఉపరితల గనులు ఉన్నాయి. వీటిలో 5,700 మంది కార్మికులు విధులు నిర్వహిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని