logo

నత్తే నయం..!

జిల్లా కేంద్రంలో అభివృద్ధి పనులకు ప్రభుత్వం రూ.కోట్ల నిధులు మంజూరు చేస్తున్నా ప్రగతి అంతంత మాత్రంగానే ఉంది. రహదారుల విస్తరణ, సైడు కాల్వలు, వరద కాలువల నిర్మాణం, సీసీ రోడ్లు, ఇతర నిర్మాణ పనులు

Published : 29 Sep 2022 02:03 IST

ముందుకు కదలని అభివృద్ధి పనులు

మహబూబాబాద్‌, న్యూస్‌టుడే: జిల్లా కేంద్రంలో అభివృద్ధి పనులకు ప్రభుత్వం రూ.కోట్ల నిధులు మంజూరు చేస్తున్నా ప్రగతి అంతంత మాత్రంగానే ఉంది. రహదారుల విస్తరణ, సైడు కాల్వలు, వరద కాలువల నిర్మాణం, సీసీ రోడ్లు, ఇతర నిర్మాణ పనులు అసంపూర్తిగా నిలిచిపోగా 30 శాతం పనులు ఇంకా ప్రారంభం కాలేదు. కొన్ని పనులకు టెండర్లు వేసినా గుత్తేదారులు ముందుకు రావడం లేదు. కొందరు కాంట్రాక్టర్లు పనులు చేసేందుకు వెనకడుగు వేస్తున్నారు. సమస్యకు గల మూల కారణాలను గుర్తించి వాటి పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవలసిన అవసరం ఉంది.

శంకుస్థాపనకే పరిమితం
మహబూబాబాద్‌ పట్టణంలోని 11వ వార్డు పరిధిలోని నక్లెస్‌ రోడ్‌ పక్కన వైకుంఠధామం నిర్మాణానికి 2020-21 ఆర్థిక సంవత్సరంలో పట్టణ ప్రగతి నిధులు రూ. 30 లక్షలు మంజూరు చేశారు. కొత్త బజార్‌లోని బస్టాండ్‌ రోడ్‌, బెస్త బజార్‌, హస్తినపురం కాలనీ, చేపల మార్కెట్‌ ప్రాంతవాసులకు సౌకర్యంగా ఉండే వైకుంఠధామం నిర్మాణానికి శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించలేదు. ఏళ్ల తరబడి ఈ ప్రాంత ప్రజలు నిజాం చెరువు శిఖంలో నక్లెస్‌ రోడ్‌ పక్కనే ఉన్న ప్రభుత్వ స్థలాన్ని శ్మశానవాటికగా వినియోగించుకుంటున్నారు. పురపాలక సంఘం ఏర్పాటైన నాటి నుంచి ఇక్కడ వైకుంఠధామం నిర్మించాలని పలుమార్లు ఆ ప్రాంత ప్రజలు వినతులు ఇస్తున్నా పట్టించుకోవడం లేదు. 2013లో శ్మశాన వాటికను ఏర్పాటు చేసేందుకు రూ. 5 లక్షలు మంజూరు చేసినా.. నిర్మాణానికి నోచుకోలేదు. ఈ ఏడాది శంకుస్థాపన చేసినా పనుల ప్రారంభంలో జాప్యం నెలకొంది.

అసంపూర్తిగా..
రెండో విడత టీయూఎఫ్‌ఐడీసీ నిధుల్లో మహబూబాబాద్‌ పట్టణంలోని నెహ్రూ చౌరస్తా నుంచి రజాలిపేట రహదారి విస్తరణకు రూ. 3.04 కోట్లు కేటాయించారు. సుమారు మూడు కిలోమీటర్లు రహదారి నిర్మాణ పనులు ప్రారంభించి మధ్యలోనే నిలిపివేశారు. రహదారి విస్తరణ వెడల్పును నిర్ణయించడంలో అధికారులు, ప్రజాప్రతినిధుల మధ్య సమన్వయం కుదరక రెండేళ్లుగా ఈ పనులు అసంపూర్తిగానే నిలిచిపోయాయి. దీంతో రాకపోకలకు నిత్యం ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు