logo

ప్రతిమ క్యాన్సర్‌ ఇనిస్టిట్యూట్‌ ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు పూర్తి

ముఖ్యమంత్రి కేసీఆర్‌ శనివారం హనుమకొండ జిల్లా దామెర క్రాసు రోడ్డు వద్ద జాతీయ రహదారి సమీపంలో ఏర్పాటు చేసిన ప్రతిమ క్యాన్సర్‌ ఇనిస్టిట్యూట్‌, ఆసుపత్రిని ప్రారంభించనున్నారు

Published : 01 Oct 2022 06:16 IST

అధికారులకు సూచనలు చేస్తున్న మంత్రి దయాకర్‌రావు

దామెర, న్యూస్‌టుడే: ముఖ్యమంత్రి కేసీఆర్‌ శనివారం హనుమకొండ జిల్లా దామెర క్రాసు రోడ్డు వద్ద జాతీయ రహదారి సమీపంలో ఏర్పాటు చేసిన ప్రతిమ క్యాన్సర్‌ ఇనిస్టిట్యూట్‌, ఆసుపత్రిని ప్రారంభించనున్నారు. ఇందుకు అవసరమైన ఏర్పాట్లను నిర్వాహకులు, అధికారులు పూర్తి చేశారు.  

పరిశీలించిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు
మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు శుక్రవారం ఆసుపత్రిని సందర్శించి ఏర్పాట్లపై ఆరా తీశారు. అధికారులు, నిర్వాహకులకు సూచనలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ హైదరాబాద్‌లోనే అందుబాటులో ఉన్న సేవలను ఉమ్మడి వరంగల్‌ జిల్లా వాసులకు అందించాలనే ఉద్దేశంతో బోయినపల్లి వినోద్‌కుమార్‌, శ్రీనివాసరావు దీన్ని ఇక్కడ ఏర్పాటు చేశారని చెప్పారు. ఈ ఇనిస్టిట్యూట్‌, ఆసుపత్రి వేల మంది విద్యార్థులు, క్యాన్సర్‌ బాధితులకు అండగా నిలవనుందన్నారు. ఈ కార్యక్రమంలో పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, హనుమకొండ, వరంగల్‌ జిల్లాల పాలనాధికారులు రాజీవ్‌గాంధీ హనుమంతు, బి.గోపి, వరంగల్‌ పోలీసు కమిషనర్‌ తరుణ్‌జోషి ఉన్నారు.
దామెర:  ప్రతిమ క్యాన్సర్‌ ఇనిస్టిట్యూట్‌, ఆసుపత్రిని  వర్ధన్నపేట ఎమ్మెల్యే, వరంగల్‌ జిల్లా తెరాస అధ్యక్షుడు ఆరూరి రమేష్‌ పరిశీలించి ఏర్పాట్లపై ఆరా తీశారు. అనంతరం హనుమకొండలోని ఆయన నివాసంలో జిల్లా ప్రజాప్రతినిధులు, నాయకులతో సమావేశం నిర్వహించారు. రాష్ట్ర రుణ విమోచన సమితి ఛైర్మన్‌ నాగుర్ల వెంకటేశ్వర్లు, కుడా మాజీ ఛైర్మన్‌ మర్రి యాదవరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని