logo

కాళరాత్రి అలంకరణలో దేవతామూర్తులు

కాళేశ్వర క్షేత్రంలో దేవీశరన్నవరాత్రి ఉత్సవాలను ఆడంబరంగా నిర్వహిస్తున్నారు. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఏడో రోజున సరస్వతీదేవీ జన్మదినం మూలనక్షత్రాన్ని పురస్కరించుకొని అమ్మ వార్లకు విశేష పూజలు నిర్వహించారు. సరస్వతీ ఆలయంలో అర్చకులు ఉత్సవమూర్తులను ప్రత్యేక పీఠంపై ఉంచి అభిషేకాలు నిర్వహించారు.

Published : 03 Oct 2022 01:54 IST

సరస్వతీ అమ్మవారు

కాళేశ్వరం న్యూస్‌టుడే: కాళేశ్వర క్షేత్రంలో దేవీశరన్నవరాత్రి ఉత్సవాలను ఆడంబరంగా నిర్వహిస్తున్నారు. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఏడో రోజున సరస్వతీదేవీ జన్మదినం మూలనక్షత్రాన్ని పురస్కరించుకొని అమ్మ వార్లకు విశేష పూజలు నిర్వహించారు. సరస్వతీ ఆలయంలో అర్చకులు ఉత్సవమూర్తులను ప్రత్యేక పీఠంపై ఉంచి అభిషేకాలు నిర్వహించారు. చిన్నారులకు అక్షరాభ్యాసం నిర్వహించారు. శుభానంద, సరస్వతిదేవీలు కాళరాత్రి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. సర్పంచి వసంత, ఎంపీటీసీ సభ్యురాలు మమత, సీనియర్‌ సహాయకులు ఉమామహేశ్వర్‌ పాల్గొన్నారు. సోమవారం సద్దుల బతుకమ్మ నిర్వహణ కోసం దేవస్థానం అధికారుల ఆధ్వర్యంలో మైదాన ప్రాంతాన్ని శుభ్రం చేసి విద్యుత్తు దీపాలతో అలంకరించారు.

శుభానంద దేవి..

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని