logo

వేడుకలకు ‘మహా’ ఏర్పాట్లు

వరంగల్‌, హనుమకొండ ప్రాంతాల్లో సద్దుల బతుకమ్మకు గ్రేటర్‌ వరంగల్‌ విస్తృతమైన ఏర్పాట్లు చేస్తుంది. సుమారు రూ.3కోట్లతో వివిధ అభివృద్ధి పనులు చేపట్టారు. విద్యుదీకరణ పనులు రూ.1.50 కోట్లు, రూ.1.50 కోట్లతో సివిల్‌ పనులు ప్రతిపాదించారు. కాజీపేట, హనుమకొండ, వరంగల్‌ త్రినగరాలు, విలీన గ్రామాల్లో మహిళలు బతుకమ్మ ఆడేందుకు విస్తృతమైన ఏర్పాట్లు చేశారు.

Published : 03 Oct 2022 01:54 IST

భద్రకాళి దేవాలయం వద్ద కొత్తగా ఏర్పాటు చేసిన కొలను

రంగంపేట, న్యూస్‌టుడే: వరంగల్‌, హనుమకొండ ప్రాంతాల్లో సద్దుల బతుకమ్మకు గ్రేటర్‌ వరంగల్‌ విస్తృతమైన ఏర్పాట్లు చేస్తుంది. సుమారు రూ.3కోట్లతో వివిధ అభివృద్ధి పనులు చేపట్టారు. విద్యుదీకరణ పనులు రూ.1.50 కోట్లు, రూ.1.50 కోట్లతో సివిల్‌ పనులు ప్రతిపాదించారు. కాజీపేట, హనుమకొండ, వరంగల్‌ త్రినగరాలు, విలీన గ్రామాల్లో మహిళలు బతుకమ్మ ఆడేందుకు విస్తృతమైన ఏర్పాట్లు చేశారు. చెరువులు, కుంటల్లో గుర్రపు డెక్క, అడవి తుంగ తొలగించారు. ప్రధాన, అంతర్గత రహదారుల్లో గుంతలు పూడ్చటం, మైదానాలు చదును చేయడం, పారిశుద్ధ్యం, తాగునీటి వసతి, లైటింగ్‌ పనులు చేశారు. ఆదివారం ఇన్‌ఛార్జి ఎస్‌ఈ ప్రవీణ్‌చంద్ర, ఈఈలు శ్రీనివాసరావు, శ్రీనివాస్‌, సంజయ్‌కుమార్‌, డీఈలు, ఏఈలు పరిశీలించారు.

హనుమకొండ సిద్దేశ్వర గుండం వద్ద..

నీటి కొలను ఏర్పాటు
సద్దుల బతుకమ్మ పండగ నాడు బతుకమ్మ ఆడేందుకు భద్రకాళి దేవాలయానికి మహిళలు పెద్ద ఎత్తున వస్తారు. బతుకమ్మల నిమజ్జనానికి కీర్తి గార్డెన్‌ పక్కనే కొత్తగా బతుకమ్మ పాండ్‌(నీటి కొలను) ఏర్పాటు చేశారు. ఆదివారం మధ్యాహ్నం మేయర్‌ గుండు సుధారాణి, 11వ డివిజన్‌ కార్పొరేటర్‌ దేవరకొండ విజయలక్ష్మి, డీఈ రవికుమార్‌, శానిటరీ సూపర్‌వైజర్‌ సాంబయ్య తదితరులు పరిశీలించారు.

Read latest Warangal News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts