logo

75 అడుగుల భారీ రావణ బొమ్మ, లేజర్‌ షో

రాష్ట్రంలోనే మైసూర్‌ తరహాలో వరంగల్‌ ఉర్సు గుట్ట రంగలీల మైదానంలో అత్యంత వైభవంగా నిర్వహించనున్న సద్దుల బతుకమ్మ, దసరా ఉత్సవాలకు అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి అయ్యాయని, ప్రజలు ఉత్సవాలను విజయవంతం చేయాలని ఉర్సు, కరీమాబాద్‌ బతుకమ్మ, దసరా ఉత్సవ కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు నాగపూరి సంజయ్‌బాబు, మేడిది మధుసూదన్‌ తెలిపారు.

Published : 03 Oct 2022 01:54 IST

మాట్లాడుతున్న సంజయ్‌బాబు, మధుసూదన్‌ తదితరులు

కరీమాబాద్‌, న్యూస్‌టుడే: రాష్ట్రంలోనే మైసూర్‌ తరహాలో వరంగల్‌ ఉర్సు గుట్ట రంగలీల మైదానంలో అత్యంత వైభవంగా నిర్వహించనున్న సద్దుల బతుకమ్మ, దసరా ఉత్సవాలకు అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి అయ్యాయని, ప్రజలు ఉత్సవాలను విజయవంతం చేయాలని ఉర్సు, కరీమాబాద్‌ బతుకమ్మ, దసరా ఉత్సవ కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు నాగపూరి సంజయ్‌బాబు, మేడిది మధుసూదన్‌ తెలిపారు. ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు ఉత్సవాల ఏర్పాట్లను వివరించారు. ఉత్సవాల్లో ముఖ్య అతిథిగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, అతిథులుగా మేయర్‌ సుధారాణి, ఎమ్మెల్సీలు బస్వరాజు సారయ్య, బండా ప్రకాశ్‌, ఎంపీ దయాకర్‌, జిల్లా కలెక్టర్‌ గోపి, పోలీసు కమిషనర్‌ తరుణ్‌జోషి, బల్దియా’ కమిషనర్‌ ప్రావీణ్య, స్థానిక కార్పొరేటర్లు పాల్గొంటారన్నారు.  లైటింగ్‌, బారికేడ్ల నిర్మాణం, ఇతర సౌకర్యాలు కల్పించనున్నట్లు తెలిపారు. సద్దుల బతుకమ్మ సంబురాల్లో పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. 5న దసరా నాడు సాయంత్రం 4 గంటలకు కరీమాబాద్‌ రామస్వామి గుడి నుంచి సీతారాముడు, లక్ష్మణుడు, ఆంజనేయస్వామి విగ్రహాలతో రథం బయలుదేరి ఉర్సుగుట్ట రంగలీలా మైదానానికి చేరుకుంటుందన్నారు. సాయంత్రం 7 గంటలకు జిల్లా సాంస్కృతిక మండలి ఆధ్వర్యంలో కార్యక్రమాలు ప్రారంభమవుతాయన్నారు. తూర్పు ఎమ్మెల్యే నరేందర్‌ అధ్యక్షతన  సభానంతరం 75 అడుగుల రావణ విగ్రహ వధను ముఖ్య అతిథులు ప్రారంభిస్తారన్నారు. ఈసారి ఉత్సవాలలో గుట్టపై లేజర్‌షో, వివిధ కళాప్రదర్శనలు, మిమిక్రీ షోలుంటాయన్నారు. భారీగా బాణాసంచా కాల్చనున్నట్లు ఉత్సవ కమిటీ ట్రస్టు అధ్యక్షుడు కోటేశ్వర్‌ వివరించారు. ఉత్సవ కమిటీ కన్వీనర్‌ వొడ్నాల నరేందర్‌  వాహనాల పార్కింగ్‌ ఏర్పాట్లను తెలిపారు. కాగా కమిటీలో గత 30సంవత్సరాలుగా కోశాధికారిగా పనిచేస్తున్న తనను ఆ పదవి నుంచి తప్పించి ప్రస్తుతం అమెరికాలో ఉన్న వ్యక్తికి ఇవ్వడంపై మీడియా సమక్షంలో ప్రశ్నించిన మండ వెంకన్నగౌడ్‌ను కమిటీ నుంచి తొలగిస్తున్నట్లు ఉత్సవ కమిటీ అధ్యక్షుడు నాగపూరి సంజయ్‌బాబు తెలిపారు. సమావేశంలో ఉత్సవ కమిటీ కార్యనిర్వహణ కార్యదర్శులు  అనిల్‌కుమార్‌,  రాంప్రసాద్‌, సమ్మయ్య, వెంకటేశ్వర్లు, వాసు,  సందీప్‌, రంజిత్‌గౌడ్‌, సంజయ్‌, రాజు,  వేణు,  అజయ్‌, అశోక్‌, మహేశ్‌, శ్రీను, అఖిల్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు