logo

మహనీయుల బాటలో నడుద్దాం

మండలంలోని సికింద్రాబాద్‌ తండాలో గాంధీ జయంతిని పురస్కరించుకొని ఆదివారం ఆదరణ వృద్ధాశ్రమంలో వాసవి క్లబ్‌, ఇంటర్‌నేషనల్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మహాత్మ గాంధీ, స్వామి వివేకానంద విగ్రహాలను ఎస్పీ శరత్‌చంద్ర పవార్‌ ఆవిష్కరించారు.

Published : 03 Oct 2022 01:54 IST

సికింద్రాబాద్‌ తండాలో వృద్ధాశ్రమంలో విగ్రహాలను ఆవిష్కరిస్తున్న ఎస్పీ శరత్‌చంద్ర పవార్‌ తదితరులు

మహబూబాబాద్‌ రూరల్‌, న్యూస్‌టుడే: మండలంలోని సికింద్రాబాద్‌ తండాలో గాంధీ జయంతిని పురస్కరించుకొని ఆదివారం ఆదరణ వృద్ధాశ్రమంలో వాసవి క్లబ్‌, ఇంటర్‌నేషనల్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మహాత్మ గాంధీ, స్వామి వివేకానంద విగ్రహాలను ఎస్పీ శరత్‌చంద్ర పవార్‌ ఆవిష్కరించారు. రూరల్‌ సీఐ రవికుమార్‌, ఎస్సై అరుణ్‌కుమార్‌ వృద్ధులకు దుస్తులు, పండ్లు పంపిణీ చేశారు.  అనాథ పిల్లలను చేరదీసిన లోకేష్‌ సేవలు అభినందనీయమన్నారు.  విగ్రహాలు అందజేసిన వేంశెట్టి కిషోర్‌, వృద్ధులకు సహాయం అందిస్తున్న చిదిరాల ప్రభాకర్‌ను ఎస్పీ సన్మానించారు. వాసవి క్లబ్‌ అధ్యక్షులు వేంశెట్టి వేణుమాధవ్‌, కార్యదర్శి మురళి, వెంకటేశ్వర్లు, ముత్యం వెంకన్న, రాంచంద్రారెడ్డి, వెంకటేశ్‌, చిట్టిబాబు తదితరులున్నారు.

రక్తదానం సామాజిక బాధ్యత
నెహ్రూసెంటర్‌: రక్తదానం సామాజిక బాధ్యత అని జిల్లా అదనపు కలెక్టర్‌ డేవిడ్‌ అన్నారు. ఆదివారం మహాత్మాగాంధీ జయంతి పురస్కరించుకొని మహబూబాబాద్‌ సబ్‌జైలులో నిర్వహించిన వివిధ కార్యక్రమాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సబ్‌జైలులో మొక్కలు నాటిన ఆయన గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడారు. రెడ్‌ క్రాస్‌ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన శిబిరంలో రక్తదానం చేసిన వారిని అభినందించి ప్రశంసాపత్రాలు అందజేశారు. ఆటల పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. సివిల్‌ సప్లై అధికారి నర్సింహరావు, జైలు అధికారులు భిక్షపతి, రవీందర్‌, అరున్‌కుమార్‌, రామరాజు, శ్రీనివాస్‌, శేఖర్‌, నిరంజన్‌, నారాయణ, డాక్టర్‌ లక్ష్మణ్‌, భార్గవ్‌, సుధ, మోహన్‌ నరేందర్‌ తదితరులున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని