logo

సైబర్‌ కేసు నమోదు

ఆన్‌లైన్‌ కాల్‌ బెదిరింపులకు భయపడి ఓ వ్యక్తి నగదు మోసపోయిన ఘటన మండలంలోని సోమదేవరపల్లిలో జరిగింది. ఎస్సై ఒంటేరు రమేశ్‌ తెలిపిన  ప్రకారం.. గ్రామానికి చెందిన గండ్రాతి సతీష్‌కు గుర్తు తెలియని వ్యక్తి ఫోన్‌ చేసి తాను సైబర్‌క్రైం నుంచి మాట్లాడుతున్నానంటూ..

Published : 03 Oct 2022 01:54 IST

ధర్మసాగర్‌, న్యూస్‌టుడే: ఆన్‌లైన్‌ కాల్‌ బెదిరింపులకు భయపడి ఓ వ్యక్తి నగదు మోసపోయిన ఘటన మండలంలోని సోమదేవరపల్లిలో జరిగింది. ఎస్సై ఒంటేరు రమేశ్‌ తెలిపిన  ప్రకారం.. గ్రామానికి చెందిన గండ్రాతి సతీష్‌కు గుర్తు తెలియని వ్యక్తి ఫోన్‌ చేసి తాను సైబర్‌క్రైం నుంచి మాట్లాడుతున్నానంటూ.. నీపై ఆరు ఫిర్యాదులు వచ్చాయని, కేసు నమోదు చేయకూడదంటే డబ్బులు చెల్లించాలని అన్నారు. ఒక్కో కేసుకు రూ.6105 చొప్పున ఇవ్వాలని, లేకుంటే పోలీసులు వచ్చి అరెస్ట్‌ చేస్తారని బెదిరింపులకు పాల్పడ్డాడు.  భయపడిన సతీష్‌.. రూ.37 వేలు ఆన్‌లైన్‌లో చెల్లించాడు. మరుసటి రోజు మరో గుర్తు తెలియని వ్యక్తి ఫోన్‌ చేసి ఇలాగే చెప్పడంతో బాధితుడికి అనుమానం వచ్చి సైబర్‌ క్రైమ్‌ నంబర్‌ 1930కు ఫోన్‌ చేసి ఫిర్యాదు చేశారు. సీఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు..

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని