logo

అమెరికాలో తెలుగు సంప్రదాయం

సప్తసముద్రాలు దాటిన తెలుగు వారంతా తమ సంస్కృతి, సంప్రదాయాన్ని విదేశాల్లో చాటుతున్నారు. అమెరికాలో బతుకమ్మ వేడుక ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేసుకున్నారు. అరిజొనా తెలంగాణ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహిస్తున్నట్లు ప్రవాస భారతీయురాలు, ఓరుగల్లు వాసి దూదిపాల జ్యోతిరెడ్డి ‘న్యూస్‌టుడే’కు తెలిపారు.

Published : 03 Oct 2022 01:54 IST

బతుకమ్మ వద్ద మహిళలు

వరంగల్‌ సాంస్కృతికం, న్యూస్‌టుడే : సప్తసముద్రాలు దాటిన తెలుగు వారంతా తమ సంస్కృతి, సంప్రదాయాన్ని విదేశాల్లో చాటుతున్నారు. అమెరికాలో బతుకమ్మ వేడుక ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేసుకున్నారు. అరిజొనా తెలంగాణ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహిస్తున్నట్లు ప్రవాస భారతీయురాలు, ఓరుగల్లు వాసి దూదిపాల జ్యోతిరెడ్డి ‘న్యూస్‌టుడే’కు తెలిపారు. అమెరికాలోని అరిజొనా రాష్ట్రంలో 600 అడుగుల ఎత్తైన కొండ (సౌత్‌ మౌంటెన్‌)పై తెలంగాణ, ఏపీ ప్రాంతం నుంచి వెళ్లిన కుటుంబాలతోపాటు అమెరికావాసులు పాల్గొంటారన్నారు. సుమారు 3000 మంది పాల్గొనేలా ఏర్పాట్లు చేశామన్నారు. భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి నుంచి వేడుకలు మొదలవుతాయన్నారు.
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని