logo

సరస్వతి మాతగా శ్రీభద్రకాళి

శ్రీభద్రకాళి దేవి శరన్నవరాత్రుల మహోత్సవాల్లో భాగంగా ఏడో రోజు భద్రకాళి అమ్మవారు సరస్వతి మాతగా దర్శనమిచ్చారు. ఆదివారం ఉదయం ప్రధానార్చకుడు శేషు ఆధ్వర్యంలో నిత్యాహ్నికం, నవరాత్ర విశేష పూజలు నిర్వహించారు.

Published : 03 Oct 2022 01:54 IST

రంగంపేట, న్యూస్‌టుడే: శ్రీభద్రకాళి దేవి శరన్నవరాత్రుల మహోత్సవాల్లో భాగంగా ఏడో రోజు భద్రకాళి అమ్మవారు సరస్వతి మాతగా దర్శనమిచ్చారు. ఆదివారం ఉదయం ప్రధానార్చకుడు శేషు ఆధ్వర్యంలో నిత్యాహ్నికం, నవరాత్ర విశేష పూజలు నిర్వహించారు. శ్రీ భద్రకాళి అమ్మవారిని సరస్వతిగా అలంకరించారు. నవరాత్ర కల్పాన్ననుసరించి కాళరాత్రి, రక్తబీజహా దుర్గా క్రమంలో పూజారాధనలు జరిపారు. సరస్వతి మాతను దర్శించడంతో సాధకుడికి సకల విద్యలు సమకూరుతాయని ప్రధానార్చకుడు శేషు తెలిపారు. అమ్మవారి ఉత్సవమూర్తిని సర్వాంగసుందరంగా అలంకరించి రథ సేవ నిర్వహించారు. జిల్లా న్యాయమూర్తి జస్టిస్‌ కృష్ణమూర్తి కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకున్నారు. టీఎన్జీవోస్‌ అధ్యక్షుడు రాజేందర్‌, సినీ దర్శకుడు పూరీజగన్నాథ్‌ సతీమణి లావణ్య తదితరులు అమ్మవారిని దర్శించుకున్న వారిలో ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని