logo

రోడ్డుపై నిత్యం మురుగు ప్రవాహమే..!

ఈ చిత్రంలోని రహదారి చూసి ఇదేదో మారుమూల పల్లెకు చెందిన రోడ్డు అనుకుంటే పొర పడినట్లే. మండల కేంద్రమైన వెంకటాపురంలోని మొదటి వార్డుకు చెందిన చర్చీపేటకు వెళ్లే కీలక దారి. దశాబ్ధాలు గడుస్తున్నా..

Published : 04 Oct 2022 03:38 IST

వెంకటాపురం, న్యూస్‌టుడే: ఈ చిత్రంలోని రహదారి చూసి ఇదేదో మారుమూల పల్లెకు చెందిన రోడ్డు అనుకుంటే పొర పడినట్లే. మండల కేంద్రమైన వెంకటాపురంలోని మొదటి వార్డుకు చెందిన చర్చీపేటకు వెళ్లే కీలక దారి. దశాబ్ధాలు గడుస్తున్నా.. ఈ అంతర్గత దారిని అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడంతో.. నిత్యం నీటితో రాకపోకలకు ఆటంకంగా ఉంది. మురుగుకాలువ సైతం లేకపోవడంతో ఇరు వైపులా పిచ్చి మొక్కలు దట్టంగా పెరిగి దారి మధ్య నుంచే మురుగు నీరు పారుతోంది. ఆ దుస్థితిలోనే కాలనీ వాసులు నిత్యం రాకపోకలు సాగిస్తున్నారు. కాలమేదైనా ఈ దారి దుస్థితి ఇలాగే ఉంటుందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని