logo

పండగపూట ప్రజావాణి.. జనం లేక వెలవెల

ప్రతి సోమవారం జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు అందించే సమస్యలు పరిష్కరించేందుకు ఏర్పాటు చేసే ప్రజావాణి కార్యక్రమం హనుమకొండ కలెక్టరేట్‌లో వెలవెలబోయింది. ఉదయం 10.30 గంటలకు ప్రారంభమైన ప్రజావాణి కార్యక్రమానికి 12 గంటల వరకు కూడా ఒక దరఖాస్తు రాలేదు.

Published : 04 Oct 2022 03:38 IST

ఖాళీగా కూర్చున్న అధికారులు

హనుమకొండ కలెక్టరేట్‌, న్యూస్‌టుడే : ప్రతి సోమవారం జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు అందించే సమస్యలు పరిష్కరించేందుకు ఏర్పాటు చేసే ప్రజావాణి కార్యక్రమం హనుమకొండ కలెక్టరేట్‌లో వెలవెలబోయింది. ఉదయం 10.30 గంటలకు ప్రారంభమైన ప్రజావాణి కార్యక్రమానికి 12 గంటల వరకు కూడా ఒక దరఖాస్తు రాలేదు. ఫిర్యాదుదారులు రాకపోవడంతో అధికారులు ఎదురుచూడాల్సి వచ్చింది. ఈ కార్యక్రమానికి జిల్లాలోని మహిళా అధికారులు ఎవరూ హాజరుకాలేదు. డీఆర్‌డీవో శ్రీనివాస్‌కుమార్‌, కలెక్టరేట్‌ ఏవో కిరణ్‌ప్రకాశ్‌ దరఖాస్తులు స్వీకరించడానికి ముందుకు రాగా, మధ్యాహ్నం ఒంటి గంట వరకు కేవలం ఏడు దరఖాస్తులు మాత్రమే వచ్చాయి.

సెలవు ప్రకటించాల్సి ఉన్నా..: సద్దుల బతుకమ్మ పూట జనరల్‌ సెలవు ప్రకటించాల్సి ఉన్నా.. పని దినంగా ప్రభుత్వం నిర్ణయించడంతో జిల్లాలోని మహిళా ఉద్యోగులు చేసేదిలేక ఐచ్చిక సెలవు తీసుకున్నారు. బతుకమ్మ ప్రారంభ రోజులు సెలవు ఇచ్చారని, ముఖ్యమైన చివరి రోజు సెలవు ఇవ్వకపోవడంతో మహిళా ఉద్యోగులు అసహనం వ్యక్తం చేశారు. కొందరికి ఐచ్చిక సెలవులు మంజూరు కాకపోవడంతో ఇబ్బందులు పడ్డారు. రాష్ట్రంలో ప్రతిష్ఠాత్మకమైన సద్దుల బతుకమ్మ, దసరా పండగల్లో ప్రభుత్వం సెలవుదినంగా ప్రకటించకపోవడాన్ని వారు నిరసించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని