logo

భూ ఆక్రమణదారులపై చర్యలు తీసుకోండి

తమ వారసత్వ విలువైన భూమిని స్వాధీనం చేసుకున్న ఎమ్మెల్యే అరూరి రమేశ్‌, అతని బావమరిది సుదర్శన్‌, సన్నిహితుడు రాజేశ్వర్‌రెడ్డిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ఱ మాదిగ జిల్లా కలెక్టర్‌ రాజీవ్‌గాంధీని కోరారు.

Published : 04 Oct 2022 03:38 IST

కలెక్టర్‌ రాజీవ్‌గాంధీ హనుమంతుకు వినతిపత్రం ఇస్తున్న మందకృష్ణ మాదిగ

ఎన్జీవోస్‌కాలనీ, న్యూస్‌టుడే: తమ వారసత్వ విలువైన భూమిని స్వాధీనం చేసుకున్న ఎమ్మెల్యే అరూరి రమేశ్‌, అతని బావమరిది సుదర్శన్‌, సన్నిహితుడు రాజేశ్వర్‌రెడ్డిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ఱ మాదిగ జిల్లా కలెక్టర్‌ రాజీవ్‌గాంధీని కోరారు. సోమవారం హనుమకొండ కలెక్టర్‌ కార్యాలయానికి వెళ్లి మర్యాదపూర్వకంగా కలిశారు. తమ కుటుంబ సభ్యుల అనుమతి లేకుండానే అక్రమంగా రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారని చెప్పారు. నాలుగు దశాబ్దాలుగా ప్రజాక్షేత్రంలో ఉన్న తమ భూమిని స్వాధీనం చేసుకున్నారని, ఇక సాధారణ ప్రజల పరిస్థితిని అర్థం చేసుకోవచ్చన్నారు. ఆక్రమణదారులపై పోలీస్‌ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. అనంతరం భూమికి సంబంధించిన పూర్తి విషయాన్ని వినతిపత్రం రూపంలో కలెక్టర్‌కు అందజేశారు. ఆయనతోపాటు మహజన సోషలిస్ట్‌ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు తీగల ప్రదీప్‌గౌడ్‌, అధికార ప్రతినిధి మందకుమార్‌ మాదిగ తదితరులున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని