logo

అదనపు కమిషనర్‌గా రవీందర్‌యాదవ్‌

గ్రేటర్‌ వరంగల్‌ ప్రధాన కార్యాలయంలో ఇద్దరు అధికారుల మధ్య నెలకొన్న కుర్చీ పంచాయితీ తెగింది. అదనపు కమిషనర్‌గా రవీందర్‌ను నియమించినప్పటికీ నామమాత్రపు బాధ్యతలు అప్పగించారు.

Published : 04 Oct 2022 03:38 IST

కార్పొరేషన్‌, న్యూస్‌టుడే: గ్రేటర్‌ వరంగల్‌ ప్రధాన కార్యాలయంలో ఇద్దరు అధికారుల మధ్య నెలకొన్న కుర్చీ పంచాయితీ తెగింది. అదనపు కమిషనర్‌గా రవీందర్‌ను నియమించినప్పటికీ నామమాత్రపు బాధ్యతలు అప్పగించారు. క్రీడలు, డీఆర్‌ఎఫ్‌, మెప్మా, టౌన్‌ప్లానింగ్‌, సెన్సెస్‌, ఇంతకాలం ఇన్‌ఛార్జి అదనపు కమిషనర్‌గా పనిచేసిన రషీద్‌ను ఉపకమిషనర్‌గా నియమిస్తూ, కీలక బాధ్యతలు అప్పగించారు. ప్రజారోగ్యం, మలేరియా, పన్నులు, పరిపాలన వ్యవహారాలు, ఉద్యానం, ఇంజినీరింగ్‌, ఎలక్ట్రికల్‌, కౌన్సిల్‌, ఒప్పంద ఉద్యోగ, కార్మికుల పర్యవేక్షణ అప్పగిస్తూ కమిషనర్‌ ప్రావీణ్య ఉత్తర్వులు జారీ చేశారు. మొత్తం మీద నెలరోజులుగా సాగుతున్న కుర్చీ పోరు ముగిసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని