logo

అనాథ వృద్ధురాలికి అంత్యక్రియలు

అందరూ బతుకమ్మ పండగలో నిమగ్నమై ఉంటే ప్రశాంత్‌నగర్‌లోని సహృదయ వృద్ధాశ్రమ నిర్వాహకురాలు యాకూబీ మాత్రం అనాథ వృద్ధురాలి అంత్యక్రియలు నిర్వహించారు. యాకూబీ తెలిపిన ప్రకారం.. యాదాద్రి భువనగిరి జిల్లా పరిసర ప్రాంతాల్లో మతిస్థిమితం లేకుండా తిరుగుతున్న 60 ఏళ్ల వృద్ధురాలిని అక్కడి డీడబ్ల్యూవో అధికారులు గుర్తించి సహృదయ ఆశ్రమానికి సమాచారం అందించారు.

Published : 04 Oct 2022 03:38 IST

కాజీపేట, న్యూస్‌టుడే: అందరూ బతుకమ్మ పండగలో నిమగ్నమై ఉంటే ప్రశాంత్‌నగర్‌లోని సహృదయ వృద్ధాశ్రమ నిర్వాహకురాలు యాకూబీ మాత్రం అనాథ వృద్ధురాలి అంత్యక్రియలు నిర్వహించారు. యాకూబీ తెలిపిన ప్రకారం.. యాదాద్రి భువనగిరి జిల్లా పరిసర ప్రాంతాల్లో మతిస్థిమితం లేకుండా తిరుగుతున్న 60 ఏళ్ల వృద్ధురాలిని అక్కడి డీడబ్ల్యూవో అధికారులు గుర్తించి సహృదయ ఆశ్రమానికి సమాచారం అందించారు. నిర్వాహకురాలు యాకూబీ 2022 ఏప్రిల్‌ 4న ఆశ్రమంలో చేర్చుకున్నారు. సోమవారం ఆ వృద్ధురాలు మరణించారు. ఆమెకు సంబంధించి ఎవరూ లేకపోవడంతో భువనగిరి డీడబ్ల్యూవో అనుమతితో సోమవారం మధ్యాహ్నం హిందూ సంప్రదాయ పద్ధతిలో వృద్ధురాలికి అంత్యక్రియలు నిర్వహించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని