logo

మహిషాసుర మర్దినిగా భద్రకాళి

శ్రీభద్రకాళి దేవి శరన్నవరాత్రుల మహోత్సవాల్లో భాగంగా తొమ్మిదో రోజు అమ్మవారు మహిషాసుర మర్దినిగా దర్శనమిచ్చారు.

Published : 05 Oct 2022 01:33 IST

రంగంపేట, న్యూస్‌టుడే: శ్రీభద్రకాళి దేవి శరన్నవరాత్రుల మహోత్సవాల్లో భాగంగా తొమ్మిదో రోజు అమ్మవారు మహిషాసుర మర్దినిగా దర్శనమిచ్చారు. మంగళవారం ఉదయం నిత్యాహ్నికం, అమ్మవారిని మహిషాసుర మర్దినిగా అలంకరించి వరాహ పురాణాన్ని అనుసరించి సిద్ధి ధాత్రి దుర్గ క్రమంలో, బోధాయనోక్త నవరాత్ర కల్పాన్ని అనుసరించి శుంభహాదుర్గా క్రమంలో అమ్మవారికి పూజారాధనలు జరిపారు. మధ్యాహ్నం జరిగిన దేవీ నవరాత్రుల మహా పూర్ణాహుతిలో చీఫ్‌విప్‌ వినయ్‌భాస్కర్‌, ఎమ్మెల్సీలు శ్రీనివాస్‌రెడ్డి, సారయ్య, ‘కుడా’ ఛైర్మన్‌ సుందర్‌రాజ్‌, రాష్ట్ర వికలాంగుల సంస్థ ఛైర్మన్‌ వాసుదేవరెడ్డి, ఈవో శేషుభారతి తదితరులు పాల్గొన్నారు.

Read latest Warangal News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని