logo

విజయానికి ప్రతీక దసరా

చెడుపై విజయానికి ప్రతీక విజయదశమి అని ఎస్పీ సురేందర్‌రెడ్డి అన్నారు. మంగళవారం జిల్లా ఆర్మ్‌డ్‌ రిజర్వు ప్రధాన కార్యాలయంలో ఆయుధాలు, వాహనాలకు ఎస్పీ ప్రత్యేక పూజలు చేశారు.

Published : 05 Oct 2022 02:17 IST


ఆయుధాలకు పూజ చేస్తున్న ఎస్పీ సురేందర్‌రెడ్డి

భూపాలపల్లిక్రైం, న్యూస్‌టుడే: చెడుపై విజయానికి ప్రతీక విజయదశమి అని ఎస్పీ సురేందర్‌రెడ్డి అన్నారు. మంగళవారం జిల్లా ఆర్మ్‌డ్‌ రిజర్వు ప్రధాన కార్యాలయంలో ఆయుధాలు, వాహనాలకు ఎస్పీ ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ సమాజంలో చెడును పారదోలేందుకు పోలీసులు కృషి చేస్తున్నారన్నారు. ప్రజలకు దసరా పండగ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో భూపాలపల్లి డీఎస్పీ రాములు, స్పెషల్‌ బ్రాంచ్‌ ఇన్‌స్పెక్టర్‌ జితేందర్‌రెడ్డి, రిజర్వు ఇన్‌స్పెక్టర్లు సతీష్‌, సంతోష్‌, ఆర్‌ఎస్సై రాజేష్‌, సాయుధదళ సిబ్బంది తరితరులు పాల్గొన్నారు.

Read latest Warangal News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts