logo

దివ్య క్షేత్రంగా భద్రకాళి ఆలయం

శ్రీభద్రకాళి దేవాలయం రానున్న రోజుల్లో దివ్య క్షేత్రం కానుందని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్‌విప్‌ దాస్యం వినయ్‌భాస్కర్‌ తెలిపారు. ఆలయం చుట్టూ మాడ వీధులు, రాజగోపురంతో కొత్త కళ సంతరించుకోనుందన్నారు.

Published : 05 Oct 2022 02:17 IST


జీవో కాపీని అందజేస్తున్న చీఫ్‌విప్‌ వినయ్‌భాస్కర్‌, ఎమ్మెల్సీలు

రంగంపేట, న్యూస్‌టుడే: శ్రీభద్రకాళి దేవాలయం రానున్న రోజుల్లో దివ్య క్షేత్రం కానుందని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్‌విప్‌ దాస్యం వినయ్‌భాస్కర్‌ తెలిపారు. ఆలయం చుట్టూ మాడ వీధులు, రాజగోపురంతో కొత్త కళ సంతరించుకోనుందన్నారు. మాడ వీధుల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా రూ.20కోట్లు, కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ(కుడా) నుంచి రూ.10కోట్లు కేటాయించేలా రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి ఉత్తర్వులు జారీచేశారు. ఈ కాపీలను మంగళవారం ఈవో శేషుభారతి, ప్రధానార్చకుడు శేషుకు చీఫ్‌విప్‌ వినయ్‌, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, బస్వరాజు సారయ్య, ‘కుడా’ ఛైర్మన్‌ సుందర్‌రాజ్‌ తదితరులు అందజేశారు. బుధవారం సీఎం కేసీఆర్‌ ప్రకటించనున్న జాతీయ పార్టీ దేశ వ్యాప్తంగా బలోపేతమవ్వాలని, వచ్చే ఎన్నికల్లో విజయవంతమవ్వాలని కోరుతూ శ్రీభద్రకాళి అమ్మవారికి పూజలు చేశారు. అనంతరం విలేకరుల సమావేశంలో వినయ్‌భాస్కర్‌ మాట్లాడుతూ తొమ్మిది అంతస్తులతో రాజగోపురం నిర్మాణం చేస్తారన్నారు. త్వరలోనే  నగరంలో శిల్పా కళాశాల మంజూరు కానుందన్నారు. ఎమ్మెల్సీ శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్సీ సారయ్య, వికలాంగుల కార్పొరేషన్‌ రాష్ట్ర ఛైర్మన్‌ వాసుదేవరెడ్డి, కార్పొరేటర్‌ విజయలక్ష్మి, తెరాస నాయకులు పాల్గొన్నారు.


అమ్మవారిని దర్శించిన సీపీ

రంగంపేట: శ్రీభద్రకాళి అమ్మవారిని మంగళవారం రాత్రి వరంగల్‌ పోలీసు కమిషనర్‌ డాక్టర్‌ తరుణ్‌జోషి దర్శించుకున్నారు. అమ్మవారి మహా హారతి కార్యక్రమంలో పాల్గొన్నారు. భక్తులతో పాటు సర్వభూపాల వాహనసేవలో మమేకమయ్యారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని