logo

అంకితభావంతో పని చేస్తే గుర్తింపు

పోలీసుశాఖలో అంకితభావంతో పని చేసిన అధికారులకు గుర్తింపు లభిస్తుందని ఎస్పీ సంగ్రామ్‌సింగ్‌ జి పాటిల్‌ అన్నారు.

Published : 05 Oct 2022 02:17 IST


పేరూరు ఎస్సై కె. తిరుపతిరావుకు ప్రశంసా పత్రం అందిస్తున్న ఎస్పీ సంగ్రామ్‌సింగ్‌ 

ములుగు, వాజేడు న్యూస్‌టుడే: పోలీసుశాఖలో అంకితభావంతో పని చేసిన అధికారులకు గుర్తింపు లభిస్తుందని ఎస్పీ సంగ్రామ్‌సింగ్‌ జి పాటిల్‌ అన్నారు. మంగళవారం ములుగు జిల్లా పోలీసు కార్యాలయంలో ఆగస్టులో వర్టికల్‌లలో ప్రతిభ కనబర్చిన 15 మంది పోలీసు అధికారులకు ఆయన ప్రశంసా పత్రాలు అందించి అభినందించారు. ఎస్పీ మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసు శాఖ పాత్ర కీలకమన్నారు. అలాంటి శాఖలో అందరూ ప్రతి అంశంలో జాగ్రత్తగా పని చేయాలని సూచించారు. ప్రతిభ కనబర్చే అధికారులను, సిబ్బందిని గుర్తించి ప్రతి నెల ప్రోత్సహించే విధంగా రివార్డులు, అవార్డులు ఇస్తున్నట్లు వివరించారు. ప్రతి ఒకరు వర్టికల్‌ వారీగా పోటీ పడి విధులు నిర్వర్తించాలన్నారు. ఆన్‌లైన్‌లో సమాచారం నమోదు చేసిన విధంగా పనితనాన్ని బట్టి అవార్డులు ఇస్తున్నట్లు స్పష్టం చేశారు. ప్రజలకు మరింత మెరుగైన, వేగవంతమైన, నాణ్యమైన సేవలు అందించే ప్రయత్నం చేయాలని పిలుపునిచ్చారు. ఏఎస్పీ సుధీర్‌ రాంనాథ్‌ కేకన్‌, ఎస్బీ సీఐ సార్ల రాజు, ఆర్‌ఐ స్వామి, డీసీఆర్‌బీ ఎస్సై కమలాకర్‌ పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

ప్రశంసా పత్రాలు అందుకున్న వారు..
* ఇన్వెస్టిగేషన్‌: కె. తిరుపతిరావు, ఎస్సై వాజేడు * స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్‌: బి.ఓంకార్‌ యాదవ్‌, ఎస్సై ములుగు * స్టేషన్‌ ఇన్‌ఛార్జి: జి. ప్రభాకర్‌, హెచ్‌సీ ములుగు * రిసెప్షన్‌: ఎస్‌. ఎం.సత్యాన్వేష్‌, పీసీ పేరూరు * బ్లూకోర్‌: డి.రమేష్‌, పీసీ ములుగు * స్టేషన్‌ రైటర్‌: ఎ. రమేష్‌, పీసీ మంగపేట * కోర్టు డ్యూటీ: పి. బాల, పీసీ వెంకటాపూర్‌ * టెక్‌ టీం: ఎండీ రసూల్‌, పీసీ కన్నాయిగూడెం * సమన్స్‌: ఆర్‌. అరుణ్‌కుమార్‌, పీసీ ములుగు * వారెంట్‌: బి.కృష్ణ, పీసీ మంగపేట * 5 ఎస్‌: ఇ. ఆంజనేయులు, పీసీ వాజేడు * కమ్యూనీటీ పోలీసింగ్‌: ఎం. శారద, పీసీ పస్రా * ట్రాఫిక్‌: జి. రాజీవ్‌, పీసీ పస్రా * 5ఎస్‌ ఇన్‌ఛార్జి: బి.యశోద * టెక్‌ టీం ఇన్‌ఛార్జి: ఎం. విజయలక్ష్మి, పీసీ డీసీఆర్‌బీ ములుగు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని