అప్పుడు రీల్స్‌ కుర్రోడు.. ఇప్పుడు ప్రయాణికుడు

హనుమకొండ జిల్లా వడ్డెపల్లి చెరువు కట్టమీద అక్షయ్‌ అనే యువకుడు రైలు ముందు రీల్స్‌ చేస్తూ ప్రమాదానికి గురయ్యాడు. గమనించిన రైల్వే ట్రాక్‌మెన్లు రాజు, తిరుపతి, సురేష్‌ గుర్తించి అతన్ని సకాలంలో ఆసుపత్రిలో చేర్చారు.

Updated : 05 Oct 2022 05:54 IST

ఇద్దరి ప్రాణాలు కాపాడిన రైల్వే ట్రాక్‌మెన్లు
కాజీపేట, న్యూస్‌టుడే

* గత నెల 4వ తేదీ.. హనుమకొండ జిల్లా వడ్డెపల్లి చెరువు కట్టమీద అక్షయ్‌ అనే యువకుడు రైలు ముందు రీల్స్‌ చేస్తూ ప్రమాదానికి గురయ్యాడు. గమనించిన రైల్వే ట్రాక్‌మెన్లు రాజు, తిరుపతి, సురేష్‌ గుర్తించి అతన్ని సకాలంలో ఆసుపత్రిలో చేర్చారు.

* ఈ నెల 4వ తేదీ.. సరిగ్గా నెల. అదే వడ్డెపల్లి చెరువు కట్ట.. రైలు పట్టాలమీద తీవ్రగాయాలతో గంటన్నరపాటు పడి ఉన్న ప్రయాణికుడు శాంతిరాంను ఆ ముగ్గురే గుర్తించారు. మరికొందరి సహకారంతో సకాలంలో ఆసుపత్రికి చేర్చి ప్రాణాలు కాపాడారు.

జీఆర్‌పీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మధ్యప్రదేశ్‌కు చెందిన శాంతిరాం(24) లక్నో ఎక్స్‌ప్రెస్‌లో కాచిగూడ నుంచి నాగపూర్‌కు ప్రయాణం చేస్తున్నారు. రైలులో జనం కిక్కిరిసి ఉండటంతో తలుపు వద్ద కూర్చొని ప్రమాదవశాత్తు వడ్డెపల్లి చెరువు వద్ద ఉదయం 4.30 నుంచి 5 గంటల మధ్యలో జారిపడ్డారు. ఆ సమయంలో శాంతిరాంను ఎవరూ గుర్తించలేదు. ఉదయం 6.15 గంటలకు కీమెన్‌ రాజు రైలు పట్టాలను పరిశీలిస్తూ వెళ్తుండగా రైలుపట్టాల కంకరమీద అపస్మారక స్థితిలో పడి ఉన్న శాంతరాంను గమనించారు. అక్కడే విధుల్లో ఉన్న గ్యాంగ్‌మెన్‌లు తిరుపతి, సురేష్‌, పి.రాజు, ప్రవీణ్‌లకు సమాచారం ఇవ్వడంతో వారు అంబులెన్సుకు ఫోన్‌ చేసి అతన్ని ఆసుపత్రికి పంపారు. శాంతిరాం కోలుకుంటున్నట్లు ఆసుపత్రి వైద్యులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని