logo

ఆ అధికారులు ఎవరు?

బల్దియాలో ఇంధనం కుంభకోణం రోజుకో మలుపు తిరుగుతోంది. అక్రమాల్లో కేవలం శానిటరీ జవానే కాదు, తెరవెనుక కొందరు వింగ్‌ అధికారులున్నారని తెలిసింది. రోజువారీగా వచ్చే ఆదాయాన్ని వాటాల వారీగా పంచుకున్నట్లు గుర్తించడంతో ఆ అధికారులు ఎవరెవరన్నది ఆరా తీస్తున్నారు.

Updated : 07 Oct 2022 05:17 IST

బల్దియాలో ఇంధన కుంభకోణం

న్యూస్‌టుడే, కార్పొరేషన్‌

ట్రాక్టర్‌ నంబరు టీఎస్‌03యూసీ 8195 లాగ్‌

బుక్కులో 36 లీటర్ల డీజిల్‌గా రాసి..

బల్దియాలో ఇంధనం కుంభకోణం రోజుకో మలుపు తిరుగుతోంది. అక్రమాల్లో కేవలం శానిటరీ జవానే కాదు, తెరవెనుక కొందరు వింగ్‌ అధికారులున్నారని తెలిసింది. రోజువారీగా వచ్చే ఆదాయాన్ని వాటాల వారీగా పంచుకున్నట్లు గుర్తించడంతో ఆ అధికారులు ఎవరెవరన్నది ఆరా తీస్తున్నారు. మమల్ని ఎవరడుగుతారులే అన్నట్లుగా డ్రైవర్ల వద్ద ఉండే లాగ్‌ బుక్కుల్లో ఒక రకంగా, ప్రజారోగ్య విభాగం కంప్యూటర్‌ బిల్లు మరో రకంగా రాశారు. ఉదాహరణకు పరిశీలిస్తే వరంగల్‌ ప్రాంతం కరీమాబాద్‌లో చెత్తను తరలించే ట్రాక్టర్‌ (నంబరు టీఎస్‌02 యూసీ 8195)కు ఏప్రిల్‌ 12వ తేదీన 36 లీటర్ల డీజిల్‌ పోసినట్లు డ్రైవర్‌ వద్ద ఉన్న లాగ్‌ బుక్కులో ఉంది. ప్రజారోగ్య విభాగం కంప్యూటర్‌ షీట్‌లో 100 లీటర్లు కేటాయించినట్లుగా చూపి రూ.10,500 బిల్లు డ్రా చేశారు. ఇలా వరంగల్‌, హనుమకొండ ప్రాంతాల్లో తిరుగుతున్న ట్రాక్టర్లకు డీజిల్‌ బిల్లుల్లో తప్పుడు సమాచారం నమోదు చేశారు. ఇదేవిధంగా కంపాక్టర్లు, పొక్లెయిన్లు, స్వీపింగ్‌ మిషన్లకు విచ్చలవిడిగా డీజిల్‌ కేటాయించినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. శానిటరీ జవాన్‌తోపాటు ప్రజారోగ్య విభాగంలోని అధికారులు, శానిటరీ ఇన్‌స్పెక్టర్ల పాత్ర ఉందని తెలిసింది.

నెలకు రూ.10 లక్షలపైనే

ఇంధనం అక్రమాల్లో ప్రజారోగ్య విభాగం ఉద్యోగులే ఉన్నారని తెలిసింది. మొత్తం 250- 280 వాహనాలకు రోజువారీగా డీజిల్‌ కూపన్లు రాసి, రెండేళ్లుగా రోజూ సుమారు రూ.30- 40 వేల నగదు వెనకేసుకున్నట్లుగా సమాచారం. నెలకు రూ.10లక్షల పైనే పంచుకున్నారని ప్రచారం జరుగుతోంది. సమగ్ర విచారణ చేపడితే వాస్తవాలు వెలుగు చూసే అవకాశాలున్నాయి. అక్రమాలు జరిగాయంటున్నారు.

ప్రజారోగ్య విభాగం కంప్యూటర్‌ బిల్లులో 100 లీటర్లు

కేటాయించినట్లుగా రూ.10,500 బిల్లు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని