స్మార్ట్దారులు.. కొత్త కష్టాలు
ఆకర్షణీయ రహదారులు బొమ్మలకే పరిమితమవుతున్నాయి. పేరుకు మాత్రం స్మార్ట్ రోడ్లు..
అర్ధంతర పనులతో అవస్థలు
హనుమకొండ పద్మాక్షిగుట్ట నుంచి హంటర్ రోడ్డును కలిపేది ఇదే..
వరంగల్, కార్పొరేషన్, న్యూస్‌టుడే: ఆకర్షణీయ రహదారులు బొమ్మలకే పరిమితమవుతున్నాయి. పేరుకు మాత్రం స్మార్ట్ రోడ్లు.. వరంగల్, హనుకొండ ప్రాంతాల్లో ఏ రోడ్డు చూసినా సగం పనులే. సంవత్సరాలు గడుస్తున్నా నిర్మాణాలు పూర్తి కావడం లేదు. నిత్యం రద్దీగా ఉండే ప్రాంతాల్లో స్మార్ట్ రహదారులు రాత్రి వేళల్లో ప్రమాదాలకు నిలయాలుగా మారాయి.
కరీమాబాద్ దసరా రోడ్డు సగం వేసి వదిలేశారు. అండర్ గ్రౌండ్ డ్రైయినేజీ నిర్మించక ముందే పనులు చేపట్టారు. బీరన్నకుంట వాటర్ ట్యాంకు నుంచి కరీమాబాద్ మెయిన్ రోడ్డు వరకు గుంతలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.
వరంగల్ రైల్వే, బస్ స్టేషన్లకు వెళ్లే ప్రధాన రహదారి వరంగల్ హెడ్ పోస్టాఫీస్ సెంటర్లో సగం రోడ్డుపై వాహనదారులు, ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కంకర పోసి వదిలేశారు. నాలుగు వైపులా అసంపూర్తే..
వరంగల్ చౌరస్తా కూడలి నుంచి మేదరివాడ మీదుగా హంటర్‌రోడ్డుకు వెళ్లే స్మార్ట్ రోడ్డు పనులు ఇప్పటి వరకు మొదలవ్వలేదు. గుంతలు తవ్వి వదిలేశారు. అండర్ రైల్వేగేటు, అండర్‌బ్రిడ్జి వైపు వెళ్లే వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
సగం పనులు చేసి వదిలేశారు..
కిరణ్, శ్రీరాంకాలనీ, పద్మాక్షిగుట్ట, హనుమకొండ
స్మార్ట్ రోడ్డు పేరుతో మూడేళ్ల కిందట పనులు మొదలుపెట్టారు. ఇప్పటికీ పూర్తి కాలేదు. తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. మా నాన్న శంకరయ్య ఈ గతుకుల దారిపై రెండుసార్లు పడి గాయపడ్డారు. బల్దియా ప్రజావాణిలోనూ కమిషనర్‌కు ఫిర్యాదు ఇచ్చాం. ఇళ్లలోకి దుమ్ము, వానాకాలంలో కాలనీలు నీట మునిగి తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం.
ఇదీ పరిస్థితి..
* 2016 అక్టోబరులో వరంగల్ నగరం స్మార్ట్‌సిటీ పథకంలో ఎంపికైంది. 2018 నవంబరులో మంత్రి కేటీఆర్ తొలి విడతలో రూ.60.92 కోట్లతో ప్రతిపాదించిన 3.05 కిలోమీటర్ల నాలుగు స్మార్ట్‌రోడ్లకు శంకుస్థాపన చేశారు. నాలుగేళ్లవుతున్నా ఇవి పూర్తవ్వలేదు.
* గతేడాది రెండో విడతలో వరంగల్, హనుమకొండ ప్రాంతాల్లో రూ.82.60 కోట్లతో కొత్తగా 10 స్మార్ట్ రోడ్ల నిర్మాణాలు ప్రారంభించారు. ఏడాదవుతున్నా ఒక్క రోడ్డు పూర్తి చేయలేదు.
* పనులు చేస్తున్న గుత్తేదారులకు బిల్లులు చెల్లింపులు నిలిచాయి. దీంతో రెండు, మూడు నెలలుగా పనులు జరగడం లేదు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
KVS Admit cards: కేవీల్లో ఉద్యోగాలకు పరీక్ష రేపట్నుంచే.. అడ్మిట్ కార్డులు పొందండిలా..
-
General News
Parliament: తెలంగాణలో అవసరాన్ని బట్టి గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు: కేంద్రం
-
World News
Earthquake: భారీ భూకంపం.. తుర్కియేకు భారత సహాయ బృందాలు!
-
World News
Earthquake: తుర్కియే, సిరియాలో భూకంప విలయం.. 1600 దాటిన మృతులు
-
India News
Anand Mahindra: సానియా మీర్జా నాకు స్ఫూర్తి.. ఆనంద్ మహీంద్రా మోటివేషనల్ పోస్ట్
-
Movies News
Sembi Review: రివ్యూ: సెంబి