logo

ఉపాధ్యాయుడిగా పాలనాధికారి

జిల్లా పాలనాధికారి గోపి శనివారం వరంగల్‌ రైల్వేగేటు పెరుకవాడ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను సందర్శించారు.

Published : 27 Nov 2022 05:21 IST

విద్యార్థి అభ్యర్థన సామర్థ్యాన్ని పరిశీలిస్తున్న పాలనాధికారి గోపి

శివనగర్‌, న్యూస్‌టుడే: జిల్లా పాలనాధికారి గోపి శనివారం వరంగల్‌ రైల్వేగేటు పెరుకవాడ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను సందర్శించారు. పాఠశాలలో తొలిమెట్టు కార్యక్రమం అమలు తీరును పరిశీలించారు. నాలుగో తరగతి గది విద్యార్థులు మైకేల్‌, సాయితో ఉపాధ్యాయులు బోదించిన పాఠ్యాంశాన్ని చదివించి వారిలో పెరిగిన సామర్థ్యాలను చూసి అభినందించారు.  ఖిలావరంగల్‌ మండల తహసీˆల్దార్‌ ఫణికుమార్‌, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు నర్సింహులు, ఉపాధ్యాయులు రాజేష్‌, సుకన్య, గణేష్‌ ఉన్నారు.  అనంతరం పాఠశాలలోని పోలింగ్‌ స్టేషన్లు 102, 103, 104, 113లో ఓటరు నమోదు కార్యక్రమాన్ని పాలనాధికారి పరిశీలించారు. ఫాం-6, 7, 8 గురించి, గరుడ యాప్‌లో ఓటరు నమోదు ఎలా చేస్తున్నది పరిశీలించారు. ఓటరు నమోదు, చేర్పులు, మార్పుల గూర్చి సూచనలు చేశారు. బీఎల్‌ఓలు సుజాత, భాగ్యలక్ష్మి, జోత్స్న, శారద, ఖిలావరంగల్‌ మండల తహసీˆల్దార్‌ ఫణికుమార్‌ ఉన్నారు.


రెండుపడకల గదుల ఇళ్ల పరిశీలన

వరంగల్‌ కలెక్టరేట్‌: జిల్లాలోని తిమ్మాపురం, దూపకుంటలో నిర్మిస్తున్న రెండు పడకల గదుల ఇళ్ల నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తిచేయాలని జిల్లా పాలనాధికారి గోపి సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లా అధికారులతో కలిసి రెండుపడకల గదుల ఇళ్లను శనివారం ఆయన పరిశీలించారు.   జనవరి 15లోగా ఇళ్లను పంపిణీ చేసేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా జరగాలని సూచించారు. డీఆర్డీవో సంపత్‌రావు, స్థానిక ఎమ్మార్వో ఫణికుమార్‌ తదితర అధికారులు పాల్గొన్నారు.

Read latest Warangal News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని