అన్నంలో తెల్లపురుగులు.. 15 మంది విద్యార్థులకు అస్వస్థత
హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం పున్నేలు గ్రామ శివారులోని వర్ధన్నపేటకు చెందిన ప్రభుత్వ మైనార్టీ బాలుర గురుకుల పాఠశాల, కళాశాలలో పురుగుల అన్నం తిని 15 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు.
భోజనం సరిగా లేదని చూపిస్తున్న బాలలు
ఐనవోలు, న్యూస్‌టుడే: హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం పున్నేలు గ్రామ శివారులోని వర్ధన్నపేటకు చెందిన ప్రభుత్వ మైనార్టీ బాలుర గురుకుల పాఠశాల, కళాశాలలో పురుగుల అన్నం తిని 15 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ముగ్గురు కళ్లు తిరిగి కిందపడిపోగా 12 మందికి వాంతులు, విరోచనాలు అయ్యాయి. ఇంత జరిగినా ఆసుపత్రికి తీసుకెళ్లకుండా ఓఆర్‌ఎస్ పొట్లాలు ఇచ్చి సరిపెట్టారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులకు తెలియకూడదని ఇలా చేశారని చెబుతున్నారు.
* గురుకుల పాఠశాల, కళాశాలలో మొత్తం 400 మంది విద్యార్థులు ఉంటారు. శనివారం మధ్యాహ్నం వారికి అందించిన భోజనంలో తెల్లపురుగులొచ్చాయి.. కొందరు పిల్లలు తిన్నాక గుర్తించి వార్డెన్, సిబ్బంది దృష్టికి తీసుకెళ్లడంతో ఆ భోజనాన్ని పక్కన పెట్టి మళ్లి వంటచేసి విద్యార్థులు పెట్టారు. ఈ సంఘటన నేపథ్యంలో ప్రతిరోజు భోజనం మెత్తగా ఉంటోందని, రాళ్లు, పురుగులు వస్తున్నాయని విద్యార్థులు ఆందోళన చేశారు. సిబ్బంది గిన్నెలు కడిగిన నీటిని భోజనం, కూరల తయారీలో ఉపయోగిస్తున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయం తెలిసిన మైనార్టీ కార్పొరేషన్ విజిలెన్స్, ఇంటిలిజెన్స్ అధికారులు గురుకులానికి చేరుకొని విచారణ జరిపారు. ఘటనపై ఇన్‌ఛార్జి ప్రిన్సిపల్ సరిత స్పందిస్తూ భోజనంలో పురుగులు వచ్చిన విషయం విద్యార్థులు చెప్పగానే దాన్ని పక్కనపెట్టించి, మళ్లీ వంటచేయించి పిల్లలకు అందించామని చెప్పారు. విద్యార్థులు అందరూ బాగానే ఉన్నారని తెలిపారు. అస్వస్థతకు గురైనవారిని ఆసుపత్రికి తీసుకెళ్లకుండా నిర్లక్ష్యం చేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
EarthQuake: భూకంపం ధాటికి.. రెండు ముక్కలైన ఎయిర్పోర్టు రన్వే
-
Politics News
Andhra News: బోరుగడ్డ అనిల్ కార్యాలయాన్ని తగులబెట్టిన దుండగులు
-
Sports News
Ashwin - Australia: అశ్విన్ను చూస్తే ఆస్ట్రేలియాకు కంగారు ఎందుకు?.. సమాధానం ఇదిగో!
-
India News
Overseas Education: విదేశీ ఉన్నత విద్యపై భారీ క్రేజ్
-
General News
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
World News
Earthquake: తుర్కియే, సిరియాలో భూకంపం.. 4,500కి చేరిన మృతులు!