logo

‘మావోయిస్టులను గ్రామాల్లోకి రానివ్వొద్దు’

ఏజన్సీ ప్రాంత ప్రజల సమస్యలను తీర్చడమే లక్ష్యంగా జిల్లా పోలీసు యంత్రాంగం పనిచేస్తుందని, ఏజన్సీ ప్రజలు మావోయిస్టులను గ్రామాల్లోకి రానివ్వొద్దని జిల్లా ఎస్పీ శరత్‌చంద్రపవార్‌ పేర్కొన్నారు.

Published : 27 Nov 2022 05:21 IST

వైద్య శిబిరాన్ని ప్రారంభిస్తున్న ఎస్పీ శరత్‌చంద్రపవార్‌

బయ్యారం, న్యూస్‌టుడే: ఏజన్సీ ప్రాంత ప్రజల సమస్యలను తీర్చడమే లక్ష్యంగా జిల్లా పోలీసు యంత్రాంగం పనిచేస్తుందని, ఏజన్సీ ప్రజలు మావోయిస్టులను గ్రామాల్లోకి రానివ్వొద్దని జిల్లా ఎస్పీ శరత్‌చంద్రపవార్‌ పేర్కొన్నారు. మండలంలోని కొత్తగూడెంలో ఉచిత మెగా వైద్యశిబిరాన్ని ఆయన డీఎంహెచ్‌వో హరీష్‌రాజ్‌, సూపరింటెండెంట్‌ వెంకట్రావ్‌తో కలిసి శనివారం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో జీవిస్తున్న ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం పోలీస్‌ శాఖ నిరంతరం శ్రమిస్తుందన్నారు. ఈ ప్రాంత ప్రజలు తమ పిల్లలను ఉన్నత చదువులు చదివించాలని, యువత తమ లక్ష్యాన్ని సాధించేందుకు కృషిచేయాలని కోరారు. ఈ శిబిరానికి సుమారు 500 కుటుంబాలకు సంభందించిన ప్రజలు హాజరయ్యారు. వైద్యనిపుణులు వారికి పరీక్షలు నిర్వహించి, ఉచితంగా మందులు పంపిణీ చేశారు. వైద్యులు వీరన్న, డీఎస్పీ సదయ్య, సర్పంచి వెంకటరమణ, సీఐ బాలాజీ, ఎస్సై రమాదేవితోపాటు పలువురు సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని