ఇంటి పన్ను వసూలులో గంగదేవిపల్లి ఆదర్శం
ఇంటి పన్నుల వసూలులో గంగదేవిపల్లి ఈ ఏడాదీ ఆదర్శంగా నిలిచింది. వరంగల్ జిల్లా గీసుకొండ మండలంలోని ఈ జాతీయ ఆదర్శ గ్రామం జిల్లాలో ముందుగానే నూరుశాతం పన్ను వసూలు చేసి స్ఫూర్తిగా నిలుస్తోంది.
న్యూస్‌టుడే, గీసుకొండ, పరకాల: ఇంటి పన్నుల వసూలులో గంగదేవిపల్లి ఈ ఏడాదీ ఆదర్శంగా నిలిచింది. వరంగల్ జిల్లా గీసుకొండ మండలంలోని ఈ జాతీయ ఆదర్శ గ్రామం జిల్లాలో ముందుగానే నూరుశాతం పన్ను వసూలు చేసి స్ఫూర్తిగా నిలుస్తోంది. 1995లో మచ్చాపురం నుంచి విడిపోయి ప్రత్యేక పంచాయతీగా ఆవిర్భవించిన గంగదేవిపల్లి నాటి నుంచి నేటి వరకు వరుసగా 27 ఏళ్లపాటు నూరు శాతం ఇంటి పన్నులు వసూలు చేసి రికార్డు సృష్టించింది. జిల్లాలోని ఇతర పంచాయతీలు మార్చి నెలాఖరు నాటికి నూరు శాతం ఇంటి పన్నులు వసూలు చేస్తుండగా ఈ ఊరు మాత్రం ఏటా నవంబరు 25 నాటికే నూరు శాతం పన్నులు వసూలు చేస్తుండటం గమనార్హం. ఈ ఆర్థిక సంవత్సరంలో గ్రామంలో రూ.2,83,883 ఇంటి పన్ను వసూలు లక్ష్యం కాగా నవంబరు 25 నాటికి నూరు శాతం వసూలు చేసి ఖజానా కార్యాలయంలో జమచేశారు అన్ని గ్రామాల కంటే ముందే పన్ను వసూలు చేసినందుకు వరంగల్ డివిజనల్ పంచాయతీ అధికారి ప్రభాకర్, గీసుకొండ ఎంపీడీవో జి. రమేష్, ఎంపీవో ఎ. ప్రభాకర్ సర్పంచి గోనె మల్లారెడ్డిని అభినందించారు.
గీసుకొండ మండలంలో 74 శాతం ..
వరంగల్ జిల్లాలో మొత్తం 11 మండలాలు ఉండగా ఈ ఏడాది ఇప్పటివరకు గీసుకొండ మండలం 74.96 శాతం ఇంటి పన్ను వసూలు చేసి జిల్లాలో ప్రథమ స్థానంలో నిలిచింది. జిల్లాలో అత్యధికంగా ఇంటి పన్నులు ఉన్న మండలం ఇదే. ఇక్కడ 1,02,55,399 పన్ను వస్తోంది. ఇప్పటి వరకు 76,87,909 వసూలు చేసి జిల్లాలో మొదటి స్థానంలో నిలిచింది. జిల్లాలో 323 పంచాయతీల్లో రూ.6,22,31,921 మేర ఇంటి పన్ను వసూలు చేయాల్సి ఉండగా ఇప్పటి వరకు రూ.2,97,81,336 వసూలైంది. పన్ను వసూలులో మొదటి స్థానంలో నిలిచినందుకు జిల్లా అదనపు కలెక్టర్ అశ్విని తానాజీవాకడే ఎంపీడీవో జి. రమేష్‌ను ప్రత్యేకంగా అభినందించారు.
మాగ్రామాన్ని స్ఫూర్తిగా తీసుకుంటున్నాయి..:
గోనె మల్లారెడ్డి, సర్పంచి, గంగదేవిపల్లి
వరుసగా 27 ఏళ్లపాటు ఏటా నవంబరు 25లోపు నూరుశాతం పన్నులు చెల్లించడం బహుశా రాష్ట్రంలోనే మా గ్రామం మొదటిది కావచ్చు. సకాలంలో ఇంటి పన్నులు చెల్లించడానికి ముందుకు వచ్చిన మా గ్రామస్థులకు ప్రత్యేకంగా అభినందనలు. గ్రామపంచాయతీ సిబ్బంది కృషి వల్లనే ఇది సాధ్యం అయింది. మా గ్రామాన్ని స్ఫూర్తిగా తీసుకుని జిల్లాలోని అన్ని గ్రామాలు కూడా నూరు శాతం ఇంటి పన్ను వసూలుపై దృష్టిపెడుతున్నాయి.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
Pakistan: పాక్‌లో ఘోర ప్రమాదం.. 42మంది మృత్యువాత
-
General News
KTR: అమెరికాలో సదస్సుకు మంత్రి కేటీఆర్‌కు ఆహ్వానం
-
India News
Beating Retreat: సైనిక విన్యాసాలు భళా.. 3,500 డ్రోన్లతో మెగా షో.. వీక్షించండి
-
Sports News
Djokovic: ఆస్ట్రేలియన్ ఓపెన్ 2023.. జకోవిచ్ ఖాతాలో పదో టైటిల్.. మొత్తంగా 22వ గ్రాండ్‌స్లామ్
-
General News
Harish Rao: వైద్యరంగంలో మనం దేశానికే ఆదర్శం: హరీశ్‌రావు
-
General News
Srisailam: శ్రీశైలం ఘాట్రోడ్లో రక్షణ గోడను ఢీకొన్న ఆర్టీసీ బస్సు.. తప్పిన పెను ప్రమాదం