గంజాయి తాగుతూ పట్టుబడ్డ విద్యార్థులు
గంజాయి తాగుతున్న ఏడుగురు విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
వివరాలు వెల్లడిస్తున్న సీఐ సంజీవ్, పక్కన ఎస్సైలు, ఏఎస్సై, సిబ్బంది
కమలాపూర్, న్యూస్‌టుడే: గంజాయి తాగుతున్న ఏడుగురు విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన కమలాపూర్ మండలం మాదన్నపేట గ్రామ శివారులోని తాటివనంలో జరిగింది. ఇన్స్పెక్టర్ బొలిమల్ల సంజీవ్ విలేకర్ల సమావేశంలో వివరాలు వెల్లడించారు. కొందరు బయటి ప్రాంతాల నుంచి గంజాయి తీసుకొచ్చి హుక్కా పాట్్స, ఖాళీ వాటర్ బాటిళ్లలో నీళ్లు, గంజాయి నింపి తాగుతున్నారన్న విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు దాడి చేశారు. ఈ దాడుల్లో ఏడుగురు విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఐదుగురు డిగ్రీ, బీటెక్ చదువుతున్నారు. మరో ఇద్దరు పారిపోయారు. పారిపోయిన వారిలో ఒకరు విద్యార్థి కాగా, మరొకరు కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నారు. అరెస్టయిన వారి నుంచి ఐదు చరవాణులు, రూ.5వేల విలువ గల 510 గ్రా. గంజాయి, రెండు హుక్కా పాట్్స, మూడు శీతల పానీయాల సీసాలు, సిగరెట్ డబ్బాలను స్వాధీనం చేసుకున్నారు. 9 మందిపై కేసు నమోదు చేసినట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు. ఎస్సైలు ఎం.సతీశ్, వి.చరణ్, ఏఎస్సై సమ్మిరెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Harish Rao: వైద్యరంగంలో మనం దేశానికే ఆదర్శం: హరీశ్‌రావు
-
General News
Srisailam: శ్రీశైలం ఘాట్రోడ్లో రక్షణ గోడను ఢీకొన్న ఆర్టీసీ బస్సు.. తప్పిన పెను ప్రమాదం
-
General News
Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
Movies News
Chiranjeevi: జన్మజన్మలకు నీకే బిడ్డలుగా పుట్టాలని కోరుకుంటున్నాం..: చిరంజీవి
-
India News
PM Modi: బడ్జెట్ సమావేశాల వేళ.. మంత్రులతో ప్రధాని మోదీ కీలక భేటీ
-
General News
TelangaNews: ఎస్ఐ, కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలపై టీఎస్ఎల్పీఆర్బీ కీలక నిర్ణయం